Google AI : గూగుల్ ఏఐ కొత్త ఫీచర్.. ఇక సింపుల్‌గా ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు!
Google AI Speaking Practice : మనలో చాలామందికి ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఉంటుంది. కానీ మాట్లాడలేరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి నగరాలకు వచ్చి ఉద్యోగాలు వెతుకునే యువతీ యువకులకు ఈ అనుభవం అయ్యే ఉంటుంది. ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం తెలిసే ఉంటుంది.. కానీ భాష రాకపోవడంతో, కొత్త పదాలు తెలియకపోవడంతో సమాధానాలు ఇవ్వడానికి తెగ ఇబ్బంది పడిపోతుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్.. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా స్పీకింగ్ ప్రాక్టీస్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఏఐ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇంటరాక్టివ్ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా ఇంగ్లీష్‌ను సులువుగా ప్రాక్టీస్ చేసేందుకు వీలుంటుంది. ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా భారత్‌తో పాటు అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేసియా, మెక్సికో, వెనిజులా దేశాల్లో తీసుకొచ్చింది.
అయితే.. దీని ద్వారా కాంప్రహెన్సివ్ ఇంగ్లీష్‌ను నేర్చుకోలేరు.. కానీ ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ ద్వారా రోజువారీ సంభాషణల ఆధారంగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయొచ్చు. పద సంపదను పెంచుకోవచ్చు. గూగుల్ యాప్ ద్వారా స్పీకింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రశ్నలతో పాటు ప్రాంప్ట్‌ను కూడా అందిస్తుంది. స్పీకింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రశ్నను నేరుగా అడగవచ్చు లేదంటే టైప్ కూడా చేయవచ్చు. దీనికి ఏఐ సమాధానం ఇస్తుంది. మనం ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సూచనల రూపంలో ప్రాంప్ట్‌ను అందజేస్తుంది. అలాగే దానికి ఫాలో అప్ ప్రశ్నలను కూడా చూపిస్తుంది. మనం ఇచ్చే ఇన్‌పుట్‌ను బట్టే సమాధానాలు డిస్‌ప్లే అవుతాయ. అయితే.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది.
ఇలా యాక్టివేట్ చేసుకోండి..
ఈ స్పీకింగ్ ప్రాక్టీస్‌లో జాయిన్ కావాలంటే తప్పనిసరిగా గూగుల్ సెర్చ్ ల్యాబ్స్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌రోల్ చేసుకున్న తర్వాత వినియోగదారులు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం మొదట ఆండ్రాయిడ్ మొబైల్‌లోని గూగుల్ యాప్ ఓపెన్ చేయాలి. అందులో లెఫ్ట్‌సైడ్ టాప్ కార్నర్‌లో కనిపించే ల్యాబ్ సింబల్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే ఏఐ ఎక్స్‌పర్‌మెంట్ విభాగంలో స్పీకింగ్ ప్రాక్టీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
Thanks for reading English Learning by Artificial Intelligence Powered Speaking Practice
No comments:
Post a Comment