Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, July 15, 2024

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నారా? FDలో ఎన్ని రకాలుంటాయి తెలుసుకోండి!


 

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నారా? FDలో ఎన్ని రకాలుంటాయి తెలుసుకోండి!

Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే FD ద్వారా, మీరు మీ డబ్బును నిర్ణీత కాలానికి పెట్టుబడి పెడతారు. దీనితో, మీ డబ్బు బ్యాంకులో భద్రంగా డిపాజిట్ అయి చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు దానిపై స్థిర వడ్డీని కూడా పొందుతారు. రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి FD మంచి పెట్టుబడి ఎంపిక. కానీ సాధారణంగా అందరూ  వేర్వేరు పెట్టుబడి లక్ష్యాలతో ఉంటారు. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్(Investment) ఆప్షన్ గా FD(Fixed Deposits) ని ఎంచుకున్నట్టయితే,  మీ కోసం సరైన FDని ఎంచుకోవడం చాలా ముఖ్యం. FDలో చాలా రకాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి.. వాటిలో ఉండే లాభ నష్టాలను బేరీజు వేసుకుని అర్థం చేసుకున్న తర్వాతే ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అందుబాటులో ఉన్న వివిధరకాల FDల వివరాలు తెలుసుకుందాం.  

సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్.. 

ముందుగా రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి చూద్దాం.  ఇది సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. పథకం నిబంధనల ప్రకారం వడ్డీని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు. ఈ రకమైన FD(Fixed Deposits) లో, డబ్బు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంకు సేవింగ్స్ డిపాజిట్ల కంటే వడ్డీ రేటు ఎక్కువ. ఈ డిపాజిట్‌పై లోన్ అలాగే ఓవర్‌డ్రాఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అలంటి పరిస్థితిలో వడ్డీ తక్కువ పొందుతారు. 

టాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్..

మీరు పన్ను ఆదా చేయాలనుకుంటే, టాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Tax Saver Fixed Deposits) పెట్టుబడికి సరైన ఎంపిక. వీటికి 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. వడ్డీలు సాధారణ FD లాగానే ఉంటాయి. కానీ మెచ్యూరిటీ కంటే ముందు దానిని క్లోజ్ చేయలేము. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, మీరు రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. అయితే, ఈ FDపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. అలాగే లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండవు.

డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్..

ఇప్పుడు మరో రకమైన FD(Fixed Deposits) కూడా ఉంది, దీన్ని తెరవడానికి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీనిని డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటారు. ఈ FDలో, ఆన్‌లైన్‌లో KYC పూర్తి చేయడం నుండి డబ్బు డిపాజిట్ చేయడం.  డబ్బు విత్‌డ్రా చేయడం వరకు అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి.

రీఇన్వెస్ట్‌మెంట్ FD..

ఇప్పుడు రీఇన్వెస్ట్‌మెంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి చూదాం. దీనిపై వచ్చే వడ్డీని ఫండ్‌లోనే మళ్లీ పెట్టుబడి పెడతారు. మెచ్యూరిటీపై వడ్డీతో పాటు అసలు మొత్తం అందుతుంది. ఈ విధంగా మీరు అసలు,  తిరిగి పెట్టుబడి పెట్టిన వడ్డీ రెండింటిపై వడ్డీని పొందవచ్చు.

సీనియర్ సిటిజన్స్ FD..

సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక FD(Fixed Deposits) ఉంది. దీనిని సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటారు. ఇది సీనియర్ సిటిజన్లకు అంటే 60 ఏళ్లు పైబడిన వారికోసం ఉద్దేశించినది. ఈ FDలపై వడ్డీ రేటు ప్రామాణిక FDల కంటే 0.75 శాతం ఎక్కువగా ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లస్..

ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లస్ అనే మరో FD ఉంది. ఈ FD స్కీమ్‌లో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ రివార్డ్ ఉంటుంది. ఇందులో, సాధారణ FDతో పోలిస్తే అధిక వడ్డీ లభిస్తుంది. పెట్టుబడికి అవసరమైన కనీస మొత్తం ఎక్కువ. ఈ FD(Fixed Deposits) ని ప్రీ క్లోజ్ చేయడం సాధ్యం కాదు. సాధారణ వడ్డీ – చక్రవడ్డీ మధ్య ఎంచుకునే అవకాశం పెట్టుబడిదారుడికి ఉంది.

ఆటో ఫిక్స్‌డ్ డిపాజిట్..

ఇప్పుడు ఆటో ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి తెలుసుకుందాం. ఈ రకమైన FDకి లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.  ప్రీ-మెచ్యూర్ ఉపసంహరణపై పెనాల్టీ ఉంటుంది. ఆటో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేవింగ్స్ ఖాతాలు – ఫిక్స్‌డ్ డిపాజిట్లు రెండింటి ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో మీరు మీ సేవింగ్స్ ఖాతాలో నిర్ణీత మొత్తాన్ని ఉంచుకోవాలి. మిగిలిన డబ్బు దానంతట అదే  FD(Fixed Deposits) లోకి వెళుతుంది. దీని కారణంగా మీరు అధిక వడ్డీని పొందుతారు.

అదీవిషయం. చూశారుగా..మీరు ఈ FDల ప్రయోజనాలు – అప్రయోజనాలు గురించి అర్థం చేసుకుని ఉంటారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, మీ కోసం సరైన పథకాన్ని ఎంచుకోండి. మీ డబ్బును సురక్షితంగా డిపాజిట్ చేసి.. మంచి ఆదాయాన్ని అందుకోండి.

Thanks for reading Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నారా? FDలో ఎన్ని రకాలుంటాయి తెలుసుకోండి!

No comments:

Post a Comment