UCO Bank: యునైటెడ్ కమర్షియల్ బ్యాంకులో 544 అప్రెంటిస్ ఖాళీలు
కోల్‌కతాలోని యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం... దేశ వ్యాప్తంగా యూకో శాఖల్లో 544 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు:
* అప్రెంటిస్: 544 ఖాళీలు (ఏపీలో 07, తెలంగాణలో 08 ఖాళీలు ఉన్నాయి)
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 16.07.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
శిక్షణ వ్యవధి: ఏడాది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 02.07.2024.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16.07.2024.
Thanks for reading Job Recruitment in United Commercial Bank Limited (UCO)
No comments:
Post a Comment