Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 11, 2024

Jobs in Indian Bank: ఇండియన్ బ్యాంకులో 1,500 అప్రెంటిస్ ఖాళీలు.


 

Jobs in Indian Bank: ఇండియన్ బ్యాంకులో 1,500 అప్రెంటిస్ ఖాళీలు.

Indian Bank: ఇండియన్ బ్యాంకులో 1,500 అప్రెంటిస్ ఖాళీలు.

చెన్నైలోని ఇండియన్ బ్యాంక్, ప్రధాన కార్యాలయం… 2024-25 సంవత్సరానికి దేశవ్యాప్తంగా నెలకొన్న బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* అప్రెంటిస్: 1,500 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ 82; తెలంగాణ 42 ఖాళీలు ఉన్నాయి)

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీ- 255; ఎస్టీ- 77; ఓబీసీ- 351; ఈడబ్ల్యూఎస్‌- 137; యూఆర్‌- 680.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

శిక్షణ కాలం: 12 నెలలు.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

స్టైపెండ్: నెలకు మెట్రో/అర్బన్ శాఖల్లో రూ.15,000. రూరల్‌/ సెమీ అర్బన్ శాఖల్లో రూ.12,000.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) అంశాలు: రీజనింగ్ ఆప్టిట్యూడ్ అండ్‌ కంప్యూటర్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు).

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 10.07.2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 31.07.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 10.07.2024 నుంచి 31.07.2024 వరకు.

Website Here

Notification Here

Thanks for reading Jobs in Indian Bank: ఇండియన్ బ్యాంకులో 1,500 అప్రెంటిస్ ఖాళీలు.

No comments:

Post a Comment