Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 18, 2024

LIC New Policy: New Policy for Children's Education Named 'Amrit Bal' – Full details here


ఎల్ఐసీ కొత్త పాలసీ: పిల్లల చదువుల కోసం 'అమృత్ బాల్' పేరుతో నూతన పాలసీ – పూర్తి వివరాలు ఇవే.

ఎల్ఐసీ మరో కొత్త పాలసీని ప్రారంభించింది. తమ పిల్లల చదువుల కోసం దీర్ఘకాలంలో మదుపు చేయాలనుకునే వారి కోసం 'అమృత్ బాల్' (ప్లాన్ నం. 874) పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. నేటి నుంచి (ఫిబ్రవరి 17) నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.

ఫీచర్ల వివరాలు ఇవే:

పిల్లల ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకునే తల్లిదండ్రుల కోసం ఎల్ఐసీ ఈ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో అతి తక్కువ పాలసీ చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. ఒకేసారి చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. పైగా ఆకర్షణీయమైన గ్యారెంటీడ్ అడిషన్ (వెయ్యి రూపాయలకు రూ.80) అందిస్తారు. ప్రీమియం కాలవ్యవధిలో బీమా హామీ కూడా ఉంటుంది. పిల్లల ఉన్నత చదువుల కోసం ఎక్కువ మొత్తం అవసరమయ్యే 18-25 ఏళ్ల వయసు మధ్య పాలసీ మెచ్యూర్ అవుతుంది. దీంతో చిన్నారుల ఉన్నత చదువులకు అవసరమయ్యే నిధిని సమకూర్చుకోవడానికి వీలు పడుతుంది. రైడర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.

1. చిన్నారుల కోసం ఉద్దేశించిన ఈ పాలసీని 30 రోజుల చిన్నారి పేరు మీద కూడా తీసుకోవచ్చు. గరిష్ఠ వయో పరిమితి 13 ఏళ్లు. మెచ్యూరిటీ కనిష్ఠ వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయస్సును 25 ఏళ్లుగా ఎస్ఐసీ నిర్ణయించింది.

2. అతి తక్కువ ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. 5, 6, 7 ఆప్షన్లు ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు ఉంటుంది. గరిష్ఠంగా 25 ఏళ్లు ఎంచుకోవచ్చు.

3. ఇందులో సింగిల్ ప్రీమియం చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ ఈ ఆప్షన్ ఎంచుకుంటే.. కనీస పాలసీ టర్మ్ 5 ఏళ్లు ఉంటుంది. గరిష్ఠంగా 25 ఏళ్ల పాలసీ టర్మ్ కూడా ఎంచుకోవచ్చు.

4. కనీస సమ్ అష్యూర్డ్ పై రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపు సామర్థ్యం ఆధారంగా మీకు నచ్చిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు.

5. ఎంచుకున్న బీమా హామీ (సమ్ అష్యూర్డ్) మొత్తానికి ప్రతి వెయ్యి రూపాయలకు రూ.80 చొప్పున ఏటా పాలసీ చెల్లుబాటులో ఉన్నంత కాలం యాడ్ అవుతూ వస్తుంది.

6. పాలసీ చెల్లించే సమయంలో పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే డెత్ బెన్ఫిట్స్ కూడా నామినీకి అందిస్తారు. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్తో పాటు, గ్యారెంటీడ్ అడిషన్స్ కింద అప్పటి వరకు జమ అయిన మొత్తాన్ని చెల్లిస్తారు. 

7. ఈ పాలసీకి రైడర్లను కూడా జత చేసుకోవచ్చు. ప్రీమియం బెనిఫిట్ రైడర్ను గనుక ఎంచుకుంటే.. ఒకవేళ ప్రపోజర్కు జరగరానిది ఏదైనా జరిగితే మిగిలిన కాలవ్యవధికి గాను ఆ మొత్తాన్ని ఎలసీనే చెల్లిస్తుంది.

8. ఎనిమిది ఏళ్లలోపు చిన్నారులపై పాలసీ తీసుకుంటే.. 2 ఏళ్ల పాలసీ గడువు తర్వాత లేదా చిన్నారికి 8 ఏళ్లు వచ్చాక (ఏది ముందైతే అది) బీమా హామీ ప్రారంభం అవుతుంది. 8 ఏళ్లు పైబడిన వారికి తీసుకుంటే. పాలసీ జారీ చేసిన నాటి నుంచే రిస్క్ కవరేజీ అందిస్తామని ఎల్ఐసీ పేర్కొంది.

9. ఈ పాలసీ కింద రుణ సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్ ను ఆన్లైన్, ఆఫ్లైన్లో కొనుగోలు చేయొచ్చు. నెలవారీ, మూడు నెలలకోసారి, అర్ధ సంవత్సరానికి, ఏడాదికోసారి చొప్పున ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది.

Thanks for reading LIC New Policy: New Policy for Children's Education Named 'Amrit Bal' – Full details here

No comments:

Post a Comment