POSTAL GDS JOB Cutoff Marks: పోస్టల్ జాబ్ రావాలంటే.. కటాఫ్ ఎంత?
* గతేడాది కటాఫ్ మార్కుల విశ్లేషణ
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,355, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్‌తో నియామకాలుంటాయి. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్/ అన్ రిజర్వ్‌డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపిక సమాచారం అందిన రెండు వారాల్లోగా అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డివిజన్‌లలో 2023 జీడీఎస్ నియామకాలకు సంబంధించి ఐదో ఎంపిక జాబితా కటాఫ్ మార్కులను పరిశీలిస్తే కింది విషయాలు అవగతమవుతాయి.
POSTAL GDS JOB Complete Details Click Here
Thanks for reading POSTAL GDS JOB Cutoff Marks: పోస్టల్ జాబ్ రావాలంటే.. కటాఫ్ ఎంత?
No comments:
Post a Comment