Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 28, 2024

RRB JE Notification 2024: Apply for 7951 Junior Engineer posts


 RRB JE Recruitment: రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ పోస్టులు 

దేశంలోని నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే (Indian Railway) తీపికబురు చెప్పింది. ఆయా విభాగాల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసిన యువతకు ఇదో మంచి అవకాశం. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్‌ నంబర్‌ 03/ 2024) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్‌ఆర్‌బీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 29 వరకు కొనసాగనుంది. రెండు దశల పరీక్షల అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.

ప్రకటన వివరాలు:

1. కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్: 17 పోస్టులు (ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ మాత్రమే)

2. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 7,951.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు: కెమికల్ అండ్‌ మెటలర్జికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ అండ్‌ ఫిజిక్స్ తదితరాలు.

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.

ప్రారంభ వేతనం (నెలకు):

* జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్: రూ.35,400.

* కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్: రూ.44,900.

ఎంపిక విధానం: స్టేజ్‌-1, స్టేజ్‌-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు(CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టేజ్‌-1 పరీక్ష సబ్జెక్టులు, మార్కులు: మ్యాథ్స్‌ (30 ప్రశ్నలు- 30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), జనరల్ సైన్స్ (30 ప్రశ్నలు- 30 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య: 100. వ్యవధి: 90 నిమిషాలు.

స్టేజ్‌-2 పరీక్ష సబ్జెక్టులు, మార్కులు: జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), ఫిజిక్స్ అండ్‌ కెమిస్ట్రీ (15 ప్రశ్నలు- 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ (10 ప్రశ్నలు - 10 మార్కులు),

టెక్నికల్ ఎబిలిటీస్ (100 ప్రశ్నలు- 100 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య: 150. వ్యవధి: 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లకు రూ.250.

దరఖాస్తు ప్రక్రియ: ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో చేసుకోవాలి.

ముఖ్య తేదీలు...

* ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 30.07.2024.

* ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 29.08.2024.

* దరఖాస్తు సవరణ తేదీలు: 30.08.2024 నుంచి 08.09.2024 వరకు.

ముఖ్యాంశాలు:

* దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

* ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. 

* ఆర్‌ఆర్‌బీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 29 వరకు కొనసాగనుంది. 

* రెండు దశల పరీక్షల అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

Website Here

Notification Here

Thanks for reading RRB JE Notification 2024: Apply for 7951 Junior Engineer posts

No comments:

Post a Comment