Team India: టీమ్‌ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?
టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ సాధించడంతో బీసీసీఐ (BCCI) రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంలో స్పష్టత వచ్చింది.
టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ సాధించడంతో బీసీసీఐ (BCCI) రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన చెక్కును బీసీసీఐ అందజేసింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. రూ.125 కోట్లలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంలో స్పష్టత వచ్చింది. 15 మంది జట్టు సభ్యులతోపాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)ఒక్కొక్కరూ రూ.ఐదేసి కోట్లు అందుకోనున్నారు. ప్రపంచ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్స్ కూడా రూ.5 కోట్లు అందుకుంటారు.
బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తారు. సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు అందజేస్తారు. రిజర్వ్ ఆటగాళ్లుగా వెళ్లిన రింకు సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు రూ.కోటి చొప్పున అందజేయనున్నారు.
Thanks for reading Team India Prize money: టీమ్‌ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?
No comments:
Post a Comment