Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 8, 2024

Buying a laptop for students? Keep these things in mind and proceed!


 విద్యార్థుల కొరకు ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఈ విషయాలను మైండ్​లో పెట్టుకుని ప్రోసీడ్​! 

Laptop Buying Guide : విద్యార్థుల కోసం మార్కెట్లో చాలా ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అవసరాలు తీర్చే, మనకు బడ్జెట్‌కు తూగే దాన్ని ఎంపిక చేసుకోవడం కీలకం. ఈక్రమంలో స్టూడెంట్స్‌కు ఉపయోగపడే ల్యాప్‌టాప్ కొనుగోలు గైడ్ ఇదిగో.

Laptop Buying Guide : ల్యాప్‌టాప్‌ల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులు తమ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా ల్యాప్‌టాప్‌లను కొని వినియోగిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరి అవసరం ఒక్కో రకంగా ఉంటుంది. ఇంతకీ విద్యార్థులు ఎలాంటి ల్యాప్‌టాప్ కొనాలి? దాన్ని కొనేటప్పుడు ఏయే స్పెసిఫికేషన్లను చెక్ చేయాలి? ఎంతవరకు ధర పెట్టాలి? అనే వివరాలతో కథనమిది.

కన్ఫ్యూజన్ వద్దు, ఈ ప్రశ్నలు వేసుకోండి

తొలిసారి ల్యాప్‌టాప్ కొనేందుకు స్టోర్‌కు వెళ్లేవారు చాలా గాబరా పడిపోతుంటారు. ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఏయే అంశాల గురించి స్టోర్‌ వాళ్లను అడిగి తెలుసుకోవాలో అర్థంకాక సతమతం అవుతుంటారు. ఈ అయోమయం ఉండకూడదు అనుకుంటే, స్టోర్‌కు వెళ్లడానికి ముందు మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మీరు ల్యాప్‌టాప్ ఎందుకు కొందామని అనుకుంటున్నారు అనే మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. మీకు వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటివి చాలా ? సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, గేమింగ్‌ వంటివి కావాలా ? అనే అంశాలపై క్లారిటీకి రావాలి. వీటి ఆధారంగానే స్టోర్ వాళ్లతో మాట్లాడండి.

మీ అవసరాలను తీర్చే కెపాసిటీ, ఫీచర్స్, ఆధునిక మెకానిజం కలిగిన ల్యాప్‌‌టాప్‌లు చూపించమని అడగండి. ఈక్రమంలో మీ బడ్జెట్ రేంజ్ గురించి కూడా వారికి స్పష్టంగా చెప్పండి. ల్యాప్‌టాప్ బరువు, కొలతలు కూడా ముఖ్యమైన అంశాలే అని గుర్తుంచుకోండి. ఎక్కువ బరువు, పెద్ద సైజు ఉండే ల్యాప్‌టాప్‌లను మీతో ఇతర చోట్లకు తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని మీకు కూడా తెలుసు. మీ కంటిపై భారం పడని విధంగా స్క్రీన్‌పై ఉండే ఎలిమెంట్స్‌ను స్పష్టంగా చూపించే మీడియం లేదా అంతకంటే కొంచెం పెద్ద సైజు ల్యాప్‌టాప్‌ను తీసుకోవడం మంచిది.

ఆపరేటింగ్ సిస్టమ్ ఏది?

విద్యార్థులు తమ అకడమిక్ అవసరాలను తీర్చగలిగే ఫీచర్స్‌తో కూడిన ల్యాప్‌టాప్ కొనడానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈక్రమంలో ల్యాప్‌టాప్‌లో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఉంటే బెటర్ అనేది ముందే తెలుసుకోవాలి. ఒక్కో ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కో రకమైన సౌలభ్యాలను అందిస్తుంది. ఒక్కో దాంట్లో ఒక్కో విధమైన అప్లికేషన్లు ఉంటాయి. సాధారణంగానైతే విండోస్ ల్యాప్‌టాప్‌లు విద్యార్థులకు బాగా సూట్ అవుతుంటాయి. వీటి అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్‌లు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. యాపిల్ ల్యాప్ టాప్స్ తీసుకునే వారికి macOS ఆపరేటింగ్ సిస్టమ్ బాగా ఉంటుంది. ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంతో అనువుగా ఉంటుంది. ఇందులో చక్కటి క్లౌడ్-ఆధారిత అప్లికేషన్లు కూడా ఉంటాయి.

ప్రాసెసర్ ఎంపిక

విద్యార్థులు ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ప్రాసెసర్ (సీపీయూ) సామర్థ్యం గురించి అడిగి తెలుసుకోవాలి. ల్యాప్​టాప్ పనితీరు వేగవంతంగా ఉండాలంటే ప్రాసెసర్ స్పీడ్‌గా ఉండాలి. ఒక మంచి సీపీయూ మీ మల్టీ టాస్కింగ్ సాఫీగా జరిగేందుకు, వేగంగా లోడింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు దోహదం చేస్తుంది. విభిన్న రకాల సాఫ్ట్‌వేర్లను నిర్వహించే సామర్థ్యం దానికి ఉంటుంది. ఇంటెల్ కోర్ కంపెనీకి చెందిన 11వ తరం లేదా 12వ తరం ప్రాసెసర్లు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంటెల్ కోర్ i5 చాలా మంది విద్యార్థులకు సరిపోతుంది. ఇంటెల్ కోర్ i7 కూడా బాగుంటుంది. ఏఎండీ రైజెన్ కంపెనీ ప్రాసెసర్లు కూడా లభిస్తాయి.

ర్యామ్ ఎంత ?

విద్యార్థులు తమ అవసరాలను, వినియోగాన్ని బట్టి ల్యాప్‌టాప్‌లలో ఎంత ర్యామ్ (RAM) ఉండాలో నిర్ణయించుకోవాలి. ఒకేసారి చాలా సాఫ్ట్‌వేర్స్ వినియోగించే వారు ఎక్కువ కెపాసిటీతో కూడిన ర్యామ్ తీసుకోవాలి. అంతగా పని ఉండదు, కొన్నిఅప్లికేషన్లే వాడుతామని భావించేవారు మధ్యస్తమైన సామర్థ్యం కలిగిన ర్యామ్‌ను తీసుకుంటే సరిపోతుంది. ల్యాప్ టాప్ సిస్టమ్ స్లో కాకుండా, క్రాష్ కాకుండా నడవాలంటే ర్యామ్ సామర్థ్యం సరిగ్గా ఉండాలి. సాధారణ స్థాయి మల్టీ టాస్కింగ్ చేసే విద్యార్థులు 8జీబీ ర్యామ్ తీసుకోవచ్చు. కంటెంట్ క్రియేషన్ లేదా ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వాడే విద్యార్థులు 16 జీబీ ర్యామ్‌ను ఎంచుకోవాలి. వీడియో ఎడిటింగ్ చేసేవారు, ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్స్ వాడేవారు, రన్నింగ్ వర్చువల్ మెషీన్‌ల కోసం పనిచేసేవారు 32 జీబీ కంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన ర్యామ్‌లను వాడాలి.

స్టోరేజీ కెపాసిటీ

ల్యాప్‌టాప్‌‌లో ఫైల్స్‌ను సాధ్యమైనన్ని ఎక్కువ సేవ్ చేయాలని భావిస్తే, అవసరం మేరకు స్టోరేజీ కెపాసిటీ ఉండేలా చూసుకోవాలి. సంప్రదాయ హెచ్‌డీడీ డ్రైవ్‌ల కంటే SSD (సాలిడ్ స్టేట్ డ్రైవ్) స్టోరేజీ పరంగా వేగవంతమైంది. దీనివల్ల ల్యాప్ టాప్ బూటింగ్ వేగవంతంగా జరుగుతుంది. అందుకే స్టోరేజీ రకంలలో HDDల కంటే SSDలకు ప్రాధాన్యత ఇవ్వండి.చాలామంది స్టూడెంట్స్‌కు 256GB నుంచి 512GB స్టోరేజీ కెపాసిటీ సరిపోతుంది. పెద్ద ఫైల్స్, మీడియా లైబ్రరీలు లేదా అనేక గేమ్‌లను నిల్వ చేసే వారికి 1 టీబీ లేదా అంతకంటే ఎక్కువ స్టోరేజీ కెపాసిటీ అవసరం.

స్క్రీన్ సైజు, జీపీయూ

13 నుంచి 14 అంగుళాల స్క్రీన్ సైజు కలిగిన ల్యాప్‌టాప్ లు సరిపోతాయి. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కావాలంటే 1920x1080 రెజల్యూషన్ కలిగిన స్క్రీన్లు ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లో గ్రాఫిక్స్ కార్డ్ (GPU) అవసరం ఉండవు. గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, గేమ్ డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లోని విద్యార్థులకు అవి కావాలి. అలాంటి వారు ఇంటిగ్రేటెడ్ GPU తీసుకోవాలి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే కనీసం 8 నుంచి 10 గంటల బ్యాటరీ జీవితాన్ని అందించే ల్యాప్ టాప్ తీసుకోవాలి.

ధరలు

బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు రూ.20వేల నుంచి రూ.35వేల లోపు వచ్చేస్తాయి. అయితే ఇవి ఎంట్రీ-లెవల్ ల్యాప్‌టాప్‌లు. వీటిలో ర్యామ్ 4జీబీ, 256 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజీ ఉంటుంది. మిడ్-రేంజ్ ల్యాప్‌టాప్‌లు రూ.35వేల నుంచి రూ.60వేల రేటులో వస్తాయి. వీటిలో ర్యామ్ 8జీబీ, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజీ ఉంటుంది. విద్యార్థులకు ఇవి సరిపోతాయి. మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగితే, రూ.60వేలకుపైన రేట్లలో చాలా ల్యాప్ టాప్స్ దొరుకుతాయి. వాటి ర్యామ్, స్టోరేజీ కెపాసిటీలు కూడా ఎక్కువే.

Thanks for reading Buying a laptop for students? Keep these things in mind and proceed!

No comments:

Post a Comment