Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, August 31, 2024

Central Industrial Security Force(CISF) Constable Recruitment – For 1130 Constable (Fire) Posts


 CISF Constable: సీఐఎస్‌ఎఫ్‌లో 1130 కానిస్టేబుల్/ ఫైర్ పోస్టులు 

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తోంది. యూనిట్లకు రక్షణ నిమిత్తం సీఐఎస్‌ఎఫ్‌ 1130 కానిస్టేబుల్/ ఫైర్ (మేల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్‌ తరగతి అర్హతతో పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

* కానిస్టేబుల్/ ఫైర్ (పురుషులు): 1130 పోస్టులు (యూఆర్‌- 466, ఈడబ్ల్యూఎస్‌- 114, ఎస్సీ- 153, ఎస్టీ- 161, ఓబీసీ- 236)

*  ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 26 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి 12వ తరగతి సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌ఎం/ ఓబీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

వయోపరిమితి: 30.09.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 01/10/2001 కంటే ముందు 30/09/2006 తర్వాత జన్మించి ఉండకూడదు.

శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 170 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.21,700-రూ.69,100.

ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులు

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

రాత పరీక్ష విధానం: ఓఎమ్మార్‌/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్‌ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్/ హిందీ (25 ప్రశ్నలు- 25 మార్కులు). ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

ముఖ్య తేదీలు...

*  ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31/08/2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30/09/2024.

* దరఖాస్తు సవరణ తేదీలు: 10-10-2024 నుంచి 12-10-2024 వరకు.

ముఖ్యాంశాలు:

*  సీఐఎస్‌ఎఫ్‌ 1130 కానిస్టేబుల్/ ఫైర్ (మేల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

* ఇంటర్‌ తరగతి అర్హతతో పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CISF Fireman Recruitment 2024 Notification

Official Website

Online application

Thanks for reading Central Industrial Security Force(CISF) Constable Recruitment – For 1130 Constable (Fire) Posts

No comments:

Post a Comment