Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 1, 2024

Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification


Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification


IBPS PO Recruitment: ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIV 2025-26) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 ఖాళీలున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ప్రకటన వివరాలు...

* సీఆర్‌పీ ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ-XIV: 4,455 పోస్టులు (ఎస్సీ- 657, ఎస్టీ- 332, ఓబీసీ- 1185, ఈడబ్ల్యూఎస్‌- 435, యూఆర్‌- 1846)

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలివే...

1. బ్యాంక్ ఆఫ్ బరోడా: ఎన్‌ఆర్‌

2. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 885

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఎన్‌ఆర్‌

4. కెనరా బ్యాంక్: 750

5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000

6. ఇండియన్ బ్యాంక్: ఎన్‌ఆర్‌

7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 260

8. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200

9. పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్: 360

10. యూకో బ్యాంక్: ఎన్‌ఆర్‌

11. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎన్‌ఆర్‌

మొత్తం ఖాళీలు: 4,455.

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 

వయోపరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్  దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌  రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమ్స్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్): ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 ప్రశ్నలు- 35 మార్కులు). ప్రిలిమ్స్ మొత్తం ప్రశ్నలు- 100, మార్కులు- 100.

పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్/ హిందీ.

కేటాయించిన సమయం: 60 నిమిషాలు.

మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్/ డిస్క్రిప్టివ్): రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు- 40 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ (35 ప్రశ్నలు- 60 మార్కులు). మొత్తం ప్రశ్నలు- 155, మార్కులు- 200.

పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్/ హిందీ.

కేటాయించిన సమయం: 3 గంటలు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ & ఎస్సే): 2 ప్రశ్నలు- 25 మార్కులు.

పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్.

కేటాయించిన సమయం: 30 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్.

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2024.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది: 21.08.2024.

* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబర్, 2024.

* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబర్, 2024.

* ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: అక్టోబర్, 2024.

* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబర్/ నవంబర్, 2024.

* మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: నవంబర్, 2024.

* ఆన్‌లైన్‌ మెయిన్ ఎగ్జామ్: నవంబర్, 2024.

* మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబర్ 2024/ జనవరి 2025.

* ఇంట‌ర్వ్యూలు: జనవరి/ ఫిబ్రవరి 2025.

* తుది నియామకాలు: ఏప్రిల్, 2025.

Website Here

Notification Here

Thanks for reading Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification

No comments:

Post a Comment