PGCIL Apprentice Recruitment 2024 [1031 Post] Notification and Online Application Form
Power Grid Corporation of India Limited (PGCIL): పీజీసీఐఎల్‌లో 1,031 అప్రెంటిస్ ఖాళీలు
న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,031 అప్రెంటిస్ ఖాళీలు ఉండగా.. ఏపీ/ తెలంగాణ ప్రాంతాల్లో 68 ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీసీఐఎల్ కేంద్రం/ ప్రాజెక్ట్/ రీజియన్: కార్పొరేట్ సెంటర్ (గురుగ్రామ్), నార్తెర్న్ రీజియన్-I (ఫరీదాబాద్), నార్తెర్న్ రీజియన్-II (జమ్ము), నార్తెర్న్ రీజియన్-III (లఖ్‌నవూ), ఈస్ట్రన్ రీజియన్-I (పట్నా), ఈస్ట్రన్ రీజియన్-II (కోల్‌కతా), నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్), ఒడిశా ప్రాజెక్ట్ (భువనేశ్వర్), వెస్ట్రన్ రీజియన్-I (నాగ్‌పుర్), వెస్ట్రన్ రీజియన్-II (వడోదర), సదరన్ రీజియన్-I (హైదరాబాద్), సదరన్ రీజియన్-II (బెంగళూరు).
ప్రకటన వివరాలు:
* ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ పీఆర్ అసిస్టెంట్ అప్రెంటిస్‌షిప్
అప్రెంటిస్ ఖాళీలు: 1,031.
విభాగాలు/ ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్/ టెలికాం.
అర్హత: ఖాళీని అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం వ్యవధి.
నెలవారీ స్టైపెండ్: ఐటీఐ ట్రేడ్ రూ.13500; డిప్లొమా ట్రేడ్ రూ.15000; గ్రాడ్యుయేట్ ట్రేడ్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్ రూ.17500.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము లేదు.
ముఖ్య తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-08-2024
* ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 08-09-2024.
ముఖ్యాంశాలు:
* పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.
* మొత్తం 1,031 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.
* అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
Thanks for reading PGCIL Apprentice Recruitment 2024 [1031 Post] Notification and Online Application Form
No comments:
Post a Comment