Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 19, 2024

Postal GDS Results| పోస్టల్‌లో 44,228 పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా వచ్చేసింది


 Postal GDS Results| పోస్టల్‌లో 44,228 పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా వచ్చేసింది.

జీడీఎస్ (షెడ్యూల్, జులై 2024) రెండవ జాబితా (List II) ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్, జులై 2024) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల రెండవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1355 పోస్టులు వుండగా, తెలంగాణలో 981 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 3 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవక్ గా సేవలు అందించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ రెండవ జాబితా

తెలంగాణ జీడీఎస్ రెండవ జాబితా

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

తపాలా శాఖలో 44వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా విడుదలైంది.

Postal GDS Results|: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్(Postal) సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 44,228  గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు. పదో తరగతి అర్హతపై ఎంపిక చేసే ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం జులై 15 నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో ఏపీ నుంచి 1355 మంది; తెలంగాణ నుంచి 981 మంది షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://indiapostgdsonline.gov.in/లో అందుబాటులో ఉంచారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ తొలి జాబితా కోసం క్లిక్ చేయండి 

తెలంగాణ జీడీఎస్ తొలి జాబితా  కోసం క్లిక్ చేయండి

కంప్యూటర్ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి చేపట్టిన ఈ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 3 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. 

ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు కావాల్సినవి ఇవే..

  1. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌
  2. పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో 
  3. 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 
  4. అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు 
  5.  ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ , కుల ధ్రువీకరణ పత్రం 
  6. ఆధార్‌ కార్డు , ఆదాయ ధ్రువీకరణపత్రం
  7. దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
  8. మెడికల్‌ సర్టిఫికెట్‌

Thanks for reading Postal GDS Results| పోస్టల్‌లో 44,228 పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా వచ్చేసింది

No comments:

Post a Comment