Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 18, 2024

SBI Asha Scholarship: ఎస్‌బీఐఎఫ్‌ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024


 SBI Asha Scholarship: ఎస్‌బీఐఎఫ్‌ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024 

ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించి, వారి విద్యను ప్రోత్సహించేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఎస్‌బీఐఎఫ్‌) సహకారం అందిస్తోంది. ఆరో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులను ఎంపిక చేసి వారి చదువులకు ఆర్థికసాయం చేస్తోంది. ఎస్‌బీఐఎఫ్‌ ఆశా స్కాలర్‌షిప్‌ 2024కు దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద విద్యార్థులకు రూ.15 వేల నుంచి రూ.7.5 లక్షల వరకు ఉపకారవేతనాలను అందిస్తారు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్‌ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

స్కాలర్‌షిప్ వివరాలు...

* ఎస్‌బీఐఎఫ్‌ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024

అర్హతలు: 

* ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు; డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

* గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3లక్షలు మించకూడదు.

ఏటా అందే స్కాలర్‌షిప్‌: 

* ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.15,000.

* అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.50,000.

* పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.70,000

* ఐఐటీ విద్యార్థులకు రూ.2 లక్షలు

* ఐఐఎం (ఎంబీఏ/ పీజీడీఎం) విద్యార్థులకు రూ.7.50 లక్షలు

యూజీ, పీజీ విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పులు

ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌ మెరిట్‌, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. వచ్చిన దరఖాస్తులను అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని జమ చేస్తారు. ఇది వన్‌టైమ్‌ స్కాలర్‌షిప్‌ మాత్రమే. 

కావాల్సిన ధ్రువీకరణపత్రాలు: 

* గత విద్యాసంవత్సరానికి సంబంధించిన మార్కుల షీట్‌ 

* ప్రభుత్వ గుర్తింపు కార్డు(ఆధార్‌ వంటివి) 

* ప్రస్తుత సంవత్సరంలో అడ్మిషన్‌కు సంబంధించిన ఆధారాలు (ఫీజు రిసీట్‌, అడ్మిషన్‌ లెటర్‌/ ఐడీ కార్డు/ బోనఫైడ్‌ సర్టిఫికెట్‌) 

* ఆదాయానికి సంబంధించిన ఆధారాలు, అభ్యర్థి ఫొటో

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ-మెయిల్‌/ మొబైల్‌ నంబర్‌ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-10-2024.

ఏవైనా సందేహాలు తలెత్తితే: 011-430-92248 (ఎక్స్‌టెన్షన్‌ 303) నంబర్‌ను సంప్రదించవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సంప్రదించవచ్చు.

ముఖ్యాంశాలు:

* పేద విద్యార్థుల విద్యను ప్రోత్సహించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఎస్‌బీఐఎఫ్‌) సహకారం అందిస్తోంది. 

* ఆరో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులను ఎంపిక చేసి వారి చదువులకు ఆర్థికసాయం చేస్తోంది. 

* అర్హులైన విద్యార్థులు అక్టోబర్‌ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Official Website 

Thanks for reading SBI Asha Scholarship: ఎస్‌బీఐఎఫ్‌ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024

No comments:

Post a Comment