Army Public School Recruitment 2024 Out For TGT, PGT And PRT
AWES: ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టులు
దేశంలోని వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లున్న ప్రాంతాలు: సికింద్రాబాద్ (ఆర్‌కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ.
ఖాళీల వివరాలు:
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
3. పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్)
సబ్జెక్టులు: బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎల్‌ఈడీ, బీఈఎల్‌ఈడీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు, సీటెట్, టెట్ అర్హత తప్పనిసరి.
వయో పరిమితి: 01-04-2024 నాటికి ఫ్రెషర్స్ 40 ఏళ్లలోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యం, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
దరఖాస్తు రుసుము: రూ.385.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 10-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2024.
పరీక్ష తేదీలు: 23, 24-11-2024.
ఫలితాల వెల్లడి తేదీ: 10-12-2024.
ముఖ్యాంశాలు:
* ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.
* అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
AWES Teachers Recruitment Notification
Thanks for reading Army Public School Recruitment 2024 Out For TGT, PGT And PRT
No comments:
Post a Comment