Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవిగో
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఫోన్‌లపై పెద్దఎత్తున డిస్కౌంట్ అందించనుంది.
Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26నే సేల్ అందుబాటులోకి కానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు అందించనుంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను రివీల్ చేసింది. అందులో గూగుల్ పిక్సెల్8, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్లపై పెద్దఎత్తున రాయితీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు
బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్‌పై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మొబైల్ 8జీబీ+ 128జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.75,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.40,000 కంటే తక్కువ ధరకే లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) 8జీబీ+ 128జీబీ వేరియంట్‌నూ రూ.40వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ (Samsung Galaxy S23 FE)బేస్ వేరియంట్ మొబైల్ రూ.30వేల లోపే లభించనుంది. ఇక పోకో ఎక్స్6 ప్రో 5జీ ( Poco X6 Pro 5G) కూడా రూ.20వేల లోపే కొనుగోలు చేయొచ్చు. సీఎంఎఫ్ ఫోన్1, నథింగ్ ఫోన్2ఏ, పోకో ఎం6 ప్లస్, వివో టీ3ఎక్స్, ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో.. మొబైల్స్‌ను ఈ సేల్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులకు డిస్కౌంట్ అందించనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు అందిస్తున్నట్లు కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా లక్ష వరకు రుణ సదుపాయం పొందొచ్చని పేర్కొంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా నో- కాస్ట్ ఈఎంఐ సదుపాయం పొందొచ్చు.
Thanks for reading Flipkart Big Billion Days Sale
No comments:
Post a Comment