Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 4, 2024

Flipkart To Create Over 1 Lakh Jobs During Festive Season


 Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష ఉద్యోగాలు
కొత్తగా చేరేవారికి ప్రత్యేక ట్రైనింగ్‌

దిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. పండగల సీజన్‌ వేళ నిర్వహించే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ (The Big Billion Days 2024) సందర్భంగా లక్ష ఉద్యోగాల సృష్టించబోతున్నట్లు బుధవారం (సెప్టెంబరు 4న)  ఓ ప్రకటనలో తెలిపింది. బిగ్ బిలియన్‌ డేస్ కోసం కొత్తగా 9 నగరాల్లో కొత్తగా 11 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు కూడా ప్రారంభించామని, దీంతో వీటి సంఖ్య 83కు చేరినట్లు పేర్కొంది.

దేశ సామాజిక ఆర్థిక వృద్ధికి చేయూతలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా సప్లయ్‌ చైన్‌ విభాగంలో 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దీనివల్ల ఈ పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తాయని తెలిపింది.

సప్లయ్‌ చైన్‌ విభాగంలో ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌ హౌస్‌ అసోసియేటర్లు, లాజిస్టిక్స్‌ కో-ఆర్డినేటర్లు, కిరాణా పార్ట్‌నర్లు, డెలివరీ డ్రైవర్స్‌ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. మహిళలు, దివ్యాంగులు, ఎల్‌జీబీటీక్యూఏఐ+ కమ్యూనిటీకి చెందిన వారినీ నియమించుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కొత్తగా ఉద్యోగాల్లో తీసుకునే వీరికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. సాధారణంగా పండగల వేళ ఇ-కామర్స్‌ కంపెనీలు ప్రకటించే ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉంటాయి. ఏటా ఈ తరహా నియామకాలను చేపడుతూ ఉంటాయి.

Thanks for reading Flipkart To Create Over 1 Lakh Jobs During Festive Season

No comments:

Post a Comment