భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు
అమరావతి: ఎడతెరిపిలేని వర్షాలతో ఏపీ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరద ఉద్ధృతి కారణంగా సోమవారం (సెప్టెంబరు 2) విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఆదేశాలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా, పలువురు గల్లంతైన విషయం తెలిసిందే.
తెలంగాణలో..
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో సోమవారం (సెప్టెంబరు 2) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పలుచోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోందని చెప్పారు. వరద ఉన్నచోట ఎవరూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటికి రావొద్దని మంత్రి సూచించారు.
Thanks for reading Heavy rains.. Holiday for educational institutions in AP and Telangana on Monday
No comments:
Post a Comment