LIC New Policy: ఎల్ఐసీ కొత్త పాలసీ.. డబుల్ బెనిఫిట్స్..
LIC New Policy: దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ (LIC Index Plus) పేరుతో సరికొత్త యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తెస్తోంది. ఎల్ఐసీ జారీ చేసిన బీఎస్ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీ విక్రయాలు 2024, ఫిబ్రవరి నుంచే ఈ పాలసీని లాంఛ్ చేసింది . యూనిట్ లింక్డ్ పాలసీల ద్వారా లైఫ్ కవర్ తో పాటు దీర్ఘకాలికి లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు పెట్టుబడులు పెడుతుంది సంస్థ. దీంతో ఒకే పాలసీతో డబుల్ ప్రయోజనంగా చెప్పవచ్చు.
ఎల్ఐసీ ఇండెక్స్ ఫండ్ ప్లాన్ అనేది ఒక యూనిట్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూవల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గా ఎల్ఐసీ తెలిపింది. ఈ పాలసీ ఫిబ్రవరి 6వ తేదీన లాంఛ్ చేస్తున్నారు. దేశీయ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తో పాటు టర్మ్ ముగిసే వరకు సేవింగ్స్ జరుగుతాయి. ఒక నిర్ణాత పాలసీ సమయం గడిచిన తర్వాత వార్షిక ప్రీమియం ప్రకారం గ్యారంటీ అడిషన్స్ ఉంటాయి. వాటి ద్వారా పెట్టుబడులు పెడుతుంది కంపెనీ. ఇందులో చేరేందుకు కనీసం 90 రోజుల నుంచి 50 లేదా 60 ఏళ్ల వయసు వరకు అర్హత ఉంటుంది. సమ్ అష్యూర్డ్ ని బట్టి వయసు మారుతుంది. అలాగే కనీస మెచ్యూరిటీ వయసు 18 ఏళ్లుగా ఉండగా.. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 లేదా 85గా ఉంది. ఇందులో 90 రోజుల వయసు నుంచి 50 ఏళ్ల లోపు వారికి సమ్ అష్యూర్డ్ అనేది వార్షిక ప్రీమియంపై 7 నుంచి 10 రెట్లుగా ఉంటుంది. అలాగే 51 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారికి 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కనీస పాలసీ టర్మ్ అనేది 10 ఏళ్లు లేదా 15 ఏళ్లుగా ఉంటుంది. గరిష్ఠంగా 25 ఏళ్లుగా ఎంచుకోవచ్చు.
కనీస ప్రీమియం రేంజ్ ఏడాదికి రూ.30 వేలుగా ఉంది. ఆరు నెలలకు రూ.15000, మూడు నెలలకు రూ.7500, నెలకు రూ.2500 చొప్పున కనీసం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. పాలసీ తీసుకున్న వారు తమ ప్రీమియంలో కొంత మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అందుకు రెండు ఫండ్స్ లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. అవి ఫ్లేక్సి గ్రోత్ ఫండ్, ఫ్లేక్సీ స్మార్ట్ గ్రోత్ పండ్. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 ఇండెక్స్, ఎన్ఎస్ఈ నిప్టీ 50 ఇండెక్స్ నుంచి ఎంపిక చేసిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది ఎల్ఐసీ.
ఈ పాలసీలో అవసరాన్ని బట్టి పాక్షిక విత్ డ్రా సదుపాయం కల్పిస్తోంది. పాలసీ టర్మ్ ముగిసేనాటికి పాలసీదారుడు జీవించి ఉంటే యూనిట్ ఫండ్ విలువకు సమానంగా మెచ్యూరిటీకి చెల్లిస్తారు. ఒక వేళ మరణిస్తే.. అతను రిస్క్ కవర్ ప్రారంభమైన ముందు, ఆ తర్వాత మరణించిన దాని బట్టి బీమా చెల్లిస్తారు. అలాగే మోర్టాలిటీ ఛార్జీల చెల్లింపు అనేది షరతులను బట్టి ఉంటుంది. దీనిపై ఎల్ఐసీ లింక్డ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ సైతం తీసుకోవచ్చు. 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత పెట్టుబడి పెట్టిన యూనిట్స్ లో కొన్నింటిని విత్ డ్రా చేసుకోవచ్చు.
Thanks for reading LIC New Policy: LIC New Policy.. LIC Index Plus... Double Benefits..
No comments:
Post a Comment