TTD MLC: తిరుమల తిరుపతి దేవస్థానంలో మిడిల్ లెవల్ కన్సల్టెంట్స్ పోస్టులు
తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్… తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
* మిడిల్ లెవల్ కన్సల్టెంట్: 03 పోస్టులు
అర్హత: ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆఫీస్ మేనేజ్‌మెంట్ లేదా రెలీజియస్ ఆర్గనైజేషన్ తదితరాల విభాగంలో 10 నుంచి 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఐటీ/ అనలిటికల్/ కమ్యూనికేషన్ తదితరాల్లో నైపుణ్యం అవసరం.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.2 లక్షలతో పాటు అవసరమైన వసతి, ల్యాప్‌టాప్ సౌకర్యం కల్పిస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
పని చేసే స్థలం: తిరుపతి లేదా తిరుమల.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్, పాత అలిపిరి గెస్ట్ హౌస్, తిరుపతి చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్ చిరునామా: recruitments.slsmpc@gmail.com
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 07.10.2024.
ముఖ్యాంశాలు:
* తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
TTD Middle Level Consultant Recruitment Notification
Thanks for reading TTD MLC: Recruitment Notification for the Post of Middle Level Consultant
No comments:
Post a Comment