Turmeric: మనం వాడే పసుపు అసలైందో కాదో ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి.
ఆయుర్వేదం ప్రకారం భారతీయ వంటగదిలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మసాలా దినుసుల బరువు, పరిమాణం పెంచడానికి వాటిలో వివిధ రకాల కల్తీలు కలుపుతారు. ఏది నిజమైన పసుపో తెలుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్ మొత్తం చదవండి.
Turmeric: భారతీయ వంటగదిలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పసుపు వంటల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో ప్రతి బ్రాండ్ కాపీ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదే విధంగా మసాలా దినుసులు కల్తీ అవుతున్నాయి. మసాలా దినుసుల బరువు, పరిమాణం పెంచడానికి వాటిలో వివిధ రకాల కల్తీలు కలుపుతారు. అయితే పసుపులోనూ కల్తీ జరుగుతోందంటున్నారు నిపుణులు. ఏది నిజమైన పసుపో తెలుకునేందుకు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
నకిలీ పసుపును ఎలా గుర్తించాలి?
నకిలీ పసుపును గుర్తించడానికి ఒక గ్లాసులో నీటిని తీసుకోండి. అందులో ఒక చెంచా పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత పసుపు నకిలీ అయితే అది గ్లాసు అడుగుకు వెళ్తుంది. నకిలీ పసుపు అయితే తేలినట్టు ఉంటుంది. అంతేకాకుండా అసలు పసుపు రంగు ముదురు లేదా ప్రకాశవంతంగా మారుతుంది. నకిలీ పసుపు పొడిని నీటిలో కలిపిన వెంటనే లేత రంగులోకి మారుతుంది.
నకిలీని గుర్తించే మరో పద్ధతి:
అరచేతిపై చిటికెడు పసుపు వేసి మరో చేతి బొటన వేలితో 10-20 సెకన్ల పాటు రుద్దాలి. పసుపు స్వచ్ఛంగా ఉంటే అది చేతులపై మరకలా పడుతుంది. ఇలా చేయడం వల్ల కేవలం కొన్ని నిమిషాల్లో ఇంట్లోనే నకిలీ పసుపును గుర్తించవచ్చు. వేడి నీళ్ల గ్లాస్‌లో 1 టీస్పూన్ పసుపు వేసి ఉంచాలి. పసుపు పొడి కింద పేరుకుపోతే అది అసలు పసుపు అని అర్థం. కానీ నీటిలో వేసిన వెంటనే రంగు మారితే నకిలీదని గుర్తించాలని నిపుణులు అంటున్నారు.
Thanks for reading Turmeric: Find out if the turmeric we use is real or not with this little trick
No comments:
Post a Comment