Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 18, 2024

Aadhaar Card: How to Change Mobile Number Linked to Aadhaar Card?


 Aadhaar Card: ఆధార్‌ కార్డ్‌కి లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ను ఎలా మార్చాలి?

ప్రస్తుతం ఆధార్‌ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది అనేక వాటికి లింక్ చేయవచ్చు. ఇది గుర్తింపు పత్రం మాత్రమే కాదు, చిరునామా రుజువు కూడా. ఇది వివిధ ప్రభుత్వ సబ్సిడీలకు కూడా ఆధారం. ఆధార్ కార్డ్‌లో వ్యక్తి ఫోటో, చిరునామా మొదలైన వాటితోపాటు బయోమెట్రిక్ డేటా ఉంటుంది. ఆధార్ కార్డుకు మొబైల్ లింక్ చేయడం తప్పనిసరి అయిపోయింది. అయితే మొబైల్ నంబర్ లింక్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆన్‌లైన్ ఆధార్ ధృవీకరణకు మొబైల్ నంబర్ అవసరం. అలాగే ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.

మొబైల్ నంబర్‌ని ఆధార్ కార్డ్‌కి లింక్ చేయడం ఎలా?

మీకు సమీపంలోని ఏదైనా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లండి. అక్కడి సిబ్బంది నుంచి సంబంధిత ఫారాన్ని పొంది నింపాలి. ఆ తర్వాత మీ వేలి బయోమెట్రిక్ తీసుకుంటారు. డేటాబేస్‌లోకి లాగిన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ నంబర్ మీ ఆధార్ డేటాబేస్‌కు జోడించబడుతుంది. దీని కోసం 50 రూపాయల చార్జ్‌ చేయబడం జరుగుతుంది.

మొబైల్ నంబర్‌ను మార్చడం ఎలా?

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌కి వెళ్లి సంబంధిత ఫారమ్‌ను పొంది నింపండి. మీ బయోమెట్రిక్ ద్వారా ఆధార్ లాగిన్ అవుతుంది. ఇప్పుడు దానికి మీ కొత్త మొబైల్ నంబర్‌ను జోడించండి. 30 రోజుల్లోగా ఆధార్ డేటాబేస్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది. ఈ సేవకు రూ.50 చార్జీ ఉంటుంది. ఇదిలా ఉండగా, ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్‌ను మార్చుకునే ఎంపిక ఇప్పుడు నిలిపివేయబడింది. ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే ఆధార్ సేవ పొందేందుకు మార్గం ఉంది. ఇండియా పోస్ట్ సర్వీస్ వెబ్‌సైట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. దీని కోసం ఇక్కడున్న లింక్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

పేరు, చిరునామా, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన వివరాలను పూరించండి. ఆ తర్వాత సర్వీస్ డ్రాప్‌డౌన్‌లో IIPB ఆధార్ సేవలను ఎంచుకోండి ఇక్కడ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రెండు ఎంపికలు ఉంటాయి. ఆధార్ నమోదు, ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం. మొబైల్ లింకింగ్ అప్‌డేట్ ఎంపికను ఎంచుకోండి. మొబైల్‌లో వచ్చిన OTPని నమోదు చేసి సమర్పించండి. అప్పీల్ మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళుతుంది. ఒక అధికారి మీ వద్దకు వచ్చి ధృవీకరణ చేస్తారు.

Thanks for reading Aadhaar Card: How to Change Mobile Number Linked to Aadhaar Card?

No comments:

Post a Comment