Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 29, 2024

Expert Tips in Telugu to Improve Memory :


 చదివింది గుర్తుండటం లేదా? - ఈ టిప్స్‌ పాటించండి - ఇక మీరే క్లాస్ టాపర్‌!

చదివింది గుర్తుకు ఉండటం లేదా - గుర్తుండటానికి నిపుణులు ఇచ్చే సూచనలు ఇవే..

 రోజూ మనం ఎన్నో చూస్తాం, వింటాం. ఏవేవో చదువుతుంటాం. అనేక మందితో మాట్లాడుతుంటాం. కానీ అవన్నీ అంతగా గుర్తుండవు. ఇది సహజం. కానీ చదువు విషయానికి వస్తే విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో కొందరు చదివింది బాగా గుర్తుకు పెట్టుకుని పరీక్షలు రాసి మంచి మార్కులు సాధిస్తారు. మరికొంతమంది మాత్రం ఎంత శ్రద్ధగా చదివినా పరీక్షల సమయానికి మరిచిపోతుంటారు. పరీక్షలు సరిగా రాయక, మార్కులు రాక, తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడం ఎలా? ఇందుకోసం నిపుణులు సూచించే కొన్ని పద్ధతులు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెదడు చురుగ్గా పని చేయాలంటే జీవనశైలి సరిగ్గా ఉండాలి. పదింటిలోపే పడుకోవాలి. ఉదయం ఐదింటికల్లా నిద్రలేవాలి. నాణ్యమైన నిద్రతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మెదడులో జ్ఞాపకాలను స్టోర్‌ చేయడంతో పాటు ఇన్‌ఫర్మేషన్‌ను గుర్తుంచుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.

చురుగ్గా వినడం ప్రాక్టీస్ చేయాలి. కేవలం కంటితో చూస్తూ చదవడం మాత్రమే కాకుండా చురుగ్గా వినడం అలవాటు చేసుకోవాలి. చదివిన/ విన్న సమాచారాన్ని విశ్లేషిస్తూ మీకు మీరే ప్రశ్నలు వేసుకోవాలి. ఒకదానికొకటి అనుసంధానించడం, సమ్మరీ తయారు చేసుకోవడం, మెయిన్‌ పాయింట్లు రాసుకోవడం ఇలా ప్రాక్టీసు చేస్తే ఎప్పటికీ గుర్తుండే వీలుంటుంది.

మెమరీని పెంచుకోవడంలో విజువలైజేషన్‌ టెక్నిక్‌ చాలా ప్రధానమైనది. మీరు చదివిన లేదా చూసిన వాటిలో ఏదైనా అంశాన్ని ఊహాత్మకంగా లేదా మెదడులో ఒక రూపాన్ని ఏర్పరచుకోవాలి. అలా చేయడం వల్ల ఆ సమాచారం అవసరమైనప్పుడు వెంటనే గుర్తుకువస్తుంది.

చదివిన దాన్ని ఎప్పటికప్పుడు రీకాల్ చేసుకోవాలి. కేవలం పరీక్షల్లోనే కాకుండా సాధారణ సమయాల్లోనూ ఇలానే చేస్తుండాలి. అలా చేస్తేనే ఆయా అంశాలపై పట్టు సాధిస్తారు.

సమాచారాన్ని అంశాల వారీగా చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. అలా చేస్తే త్వరగా అర్థమవుతుంది. పరీక్షల సమయంలో లేదా అవసరమైప్పుడు సులభంగా రివిజన్ చేసుకోవచ్చు.

రోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన డైట్ పాటించాలి. వ్యాయామం మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు సమాచారాన్ని రీకాల్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది.

మీకు తెలిసిన/ నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం, చర్చించడం అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల అంశం మీకు ఇంకా బాగా గుర్తుంటుంది.

Thanks for reading Expert Tips in Telugu to Improve Memory :

No comments:

Post a Comment