Kittur Sainik School: కిత్తూరు రాణి చెన్నమ్మ బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు
కర్ణాటక రాష్ట్రం కిత్తూరులోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్- 2025-26 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అర్హతగల ఐదో తరగతి చదువుతున్న బాలికలు అక్టోబర్ 24- డిసెంబర్ 15 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ‘ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్’ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందిన బాలికలు 12వ తరగతి(సైన్స్ స్ట్రీం) వరకు చదువుకోవచ్చు. సైనిక్/ మిలిటరీ స్కూల్స్ నిబంధనల ప్రకారం సీబీఎస్‌ఈ విధానంలో బోధన ఉంటుంది.
అడ్మిషన్ వివరాలు...
* కిత్తూరు రాణి చెన్నమ్మ గురుకుల బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. నిర్దిష్ట శారీర ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: విద్యార్థినులు 2025 జూన్ 1 నాటికి పదేళ్లు నిండి పన్నెండేళ్లలోపు ఉండాలి.
ప్రవేశ విధానం: జాతీయ స్థాయిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత పొందిన వారికి ఇంటర్య్వూలు, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టులు ఉంటాయి.
పరీక్ష వివరాలు: ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను ఇంగ్లీష్, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. విద్యార్థినులు దరఖాస్తులో సూచించిన మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ప్రశ్నపత్రంతోపాటే ఆన్సర్ బుక్‌లెట్‌ను ఇస్తారు. పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ మేథమెటిక్స్- 150 మార్కులు, జనరల్ నాలెడ్జ్- 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్- 50 మార్కులు, ఇంటెల్లిజెంట్ కోషంట్/ మెంటల్ ఎబిలిటీ- 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
పరీక్ష ఫీజు: సాధారణ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ/ ఎస్టీలకు (కర్ణాటకలో నివసిస్తున్న వారికి మాత్రమే) రూ.1600.
పరీక్ష కేంద్రాలు: కిత్తూర్, విజయపూర్, బెంగళూరు, కలబురగి.
స్కూలు వార్షిక ఫీజు: రూ.2,24,300.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ విద్యార్థినులకు రూ.2,000; ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు రూ.1600
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ద ప్రిన్సిపల్, కిత్తూర్ రాణి చెన్మమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్, కిత్తూర్ 591115, బెలగావి జిల్లా, కర్ణాటక.
ముఖ్య తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.10.2024.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.12.2024.
* ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తేదీలు: 16.12.2024 నుంచి 31.12.2024.
* ప్రవేశ పరీక్ష తేదీ: 02.02.2025.
ముఖ్యాంశాలు:
* కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్- ఆరోతరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
* దేశవ్యాప్తంగా అర్హతగల ఐదో తరగతి చదువుతున్న బాలికలు అక్టోబర్ 24- డిసెంబర్ 15 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Thanks for reading KITTUR RANI CHANNAMMA RESIDENTIAL SAINIK SCHOOL FOR GIRLS
No comments:
Post a Comment