UBI: యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.
ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
* లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) (జేఎంజీఎస్-I స్కేల్): 1,500 పోస్టులు (ఎస్సీ- 224; ఎస్టీ- 109; ఓబీసీ- 404; ఈడబ్ల్యూఎస్- 150; యూఆర్- 613)
రాష్ట్రాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్- 200, అస్సాం- 50, గుజరాత్- 200, కర్ణాటక- 300, కేరళ- 100, మహారాష్ట్ర- 50, ఒడిశా- 100, తమిళనాడు- 200, తెలంగాణ- 200, పశ్చిమ్ బెంగాల్- 100.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480-రూ.85,920.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ అప్లికేషన్స్ స్క్రీనింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.
ఆన్‌లైన్ పరీక్ష/ సబ్జెక్టులు: రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ (35 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్- లెటర్ రైటింగ్ & ఎస్సే (2 ప్రశ్నలు- 25 మార్కులు).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు/ ఫీజు చెల్లింపు ప్రారంభం: 24.10.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులు/ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 13.11.2024.
ముఖ్యాంశాలు:
* యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
* అర్హులైన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Union Bank of India Local Bank Officer Recruitment Notification
Thanks for reading Union Bank of India LBO Recruitment Notification 2024 PDF Out: 1500 Local Bank Officer Vacancies, Recruitment Process, Eligibility, Apply Online
No comments:
Post a Comment