Yantra India: యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్… దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 3,883 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.
ఫ్యాక్టరీ పేరు: ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- నలంద, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- అంబర్‌నాథ్ తదితరాలు.
ఖాళీల వివరాలు:
* ట్రేడ్ అప్రెంటిస్: 3,883 ఖాళీలు (ఐటీఐకు సంబంధించి 2498; నాన్ ఐటీఐకు సంబంధించి 1385 ఖాళీలు ఉన్నాయి)
ట్రేడులు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితరాలు.
అర్హత: ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం; నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్య తేదీలు…
* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.10.2024.
* ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 21.11.2024.
ముఖ్యాంశాలు:
* ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
* ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 3,883 ఖాళీలున్నాయి.
* అర్హులైన అభ్యర్థులు నవంబర్ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Yantra India Limited Trade Apprentice Recruitment Notification
Thanks for reading Yantra India Limited Apprentice Recruitment 2024 Notice Out For [3883 Post] Eligibility Details Apply Online Form
No comments:
Post a Comment