Swollen Uvula: కొండ నాలుక వచ్చిందా.. ఈ టిప్స్‌తో చిటికెలో పోగొట్టవచ్చు..
ఒక్కోసారి గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. ఏం తిన్నా త్వరగా దిగదు. మంచి నీళ్లు తాగేందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. గొంతు దగ్గర ఏదో అడ్డబడినట్టు ఉంటుంది.
అదే కొండ నాలుక.. దీని గురించి వినే వింటారు. చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. శరీరంలో ఇది కూడా ఒక భాగం. మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లేలా కొండ నాలుకు చేస్తుంది. అదే విధంగా స్వర పేటిక సరిగా మాట్లాడేలా కూడా కొండ నాలకు హెల్ప్ చేస్తుంది. చాలా మందికి ఒక్కోసారి విపరీతంగా దగ్గు వస్తుంది. ఎన్ని మందులు వేసినా దగ్గదు. ఇందుకు కారణం కొండ నాలుక. కొండ నాలుక పొడి బారడం కారణంగా ఈ దగ్గు వస్తుంది. ఈ కొండ నాలుక ఎండిపోకుండా చూసుకోవాలి. అందుకే నీటిని తాగుతూ ఉండమని చెబుతూ ఉంటారు.
ఈ కొండ నాలుక కూడా వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటుంది. గొంతు నొప్పి, విపరీతంగా దగ్గు రావడం, గొంతు ఎర్రగా మారడం, కొండ నాలుక వాపుగా అవడం జరుగుతూ ఉంటాయి. మరికొందరిలో కొండ నాలుక పొడుగ్గా మారుతుంది. గుటక వేయడం కూడా కష్టంగా మారుతుంది. ఇది కొండ నాలుక సమస్యగా గుర్తించి.. వైద్యుల్ని సంప్రదించాలి. పలు చిట్కాల ద్వారా కూడా కొండ నాలుక సమస్యలను తగ్గించుకోవచ్చు.
అల్లం రసం:
కొండ నాలుక వాపు, ఇన్ఫెక్షన్‌కి గురైనా, పొడవుగా పెరిగినా ఈ సమస్యలను తగ్గించడంలో అల్లం రసం చక్కగా పని చేస్తుంది. అల్లం రసంతో కొద్దిగా తేనె కలిపి.. తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల త్వరగా కొండ నాలుక సమస్య నుంచి బయట పడొచ్చు. అల్లం, తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
తులసి రసం:
తులసి ఆకుల రసం తాగినా కూడా కొండ నాలుక సమస్యల నుంచి బయట పడొచ్చు. తులసి ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో కూడా యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇది కూడా కొండ నాలుకకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.
పసుపు నీరు:
గోరు వెచ్చటి నీటిలో పసుపు కలిపి తీసుకున్నా.. గొంత నొప్పి, కొండ నాలుక సమస్యలను తగ్గిస్తుంది. పసుపు నీటిని రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. త్వరగా కొండ నాలుక వాపు, ఇన్ఫెక్షన్ నుంచి బయట పడొచ్చు.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.
Thanks for reading A swollen uvula, also known as uvulitis, can be treated with home remedies
No comments:
Post a Comment