పదో తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు
ఈనాడ అమరావతి: పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేం దుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవ చ్చని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఐచ్ఛికాన్ని మార్చుకోవచ్చని సూచిం చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల వారిని ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూ గత వైకాపా ప్రభుత్వం 2020-21లో ఆదేశాలిచ్చింది. అయితే ఆంగ్ల మాధ్యమం అమ లుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున 'ఇంగ్లిష్ మీడియం' అని వాడకుండా 'ఒకే మాధ్యమం' ఉండాలని ఆదేశించారు. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమమే అన్నట్లు వ్యవహరించారు. ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ, పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు. ఒకే మాధ్యమం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మాధ్యమం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమా లను కొనసాగించారు. ఇలా తెలుగు మాధ్య మంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదీకి అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది.
♦️రికార్డుల్లోనే ఆంగ్ల మాధ్యమం
రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి చదువుతున్న వారు 6.20 లక్షల మంది ఉండగా.. ఇప్పటి వరకు ఆన్లైన్ నామినల్ రోల్స్లో 4.94 లక్షల మంది విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇందులో 39 వేలకు పైగా విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తారని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం అమలవు తున్నట్లు రికార్డుల్లో నమోదు చేసింది. క్షేత్ర స్థాయిలో తరగతులు, బోధనను పట్టించుకో కుండా ఒకే మాధ్యమం అంటూ పేర్కొంది. విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇస్తు న్నందున చాలాచోట్ల తెలుగులోనే పాఠాలు చెప్పగా.. విద్యార్థులు మాతృభాషలోనే చదువు కున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో విద్యార్థులు ఎలా రాసినా మార్కులు ఇచ్చేశారు. ఒకేసారి తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయడంతో వీరు అభ్యసనకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ బ్యాచ్ విద్యార్థులు పదో తరగతికి రావ డంతో ఆంగ్లంలో చదివి, ఆంగ్లంలో పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.
Thanks for reading Class 10 exams can also be written in Telugu
No comments:
Post a Comment