Kaushal Science Quiz 2024: కౌశల్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
8, 9, 10 తరగతుల విద్యార్థులకు అవకాశం
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు కౌశల్ సైన్స్ క్విజ్ పోటీలతో పాటు పోస్టర్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం), ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (అప్‌కాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు ప్రకటన విడుదలైంది. ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మూడు దశల్లో నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన విజేతలకు గవర్నర్ బహుమతులు ఇవ్వనున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, నగదు బహుమతులు ఉంటాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయించాలి. నవంబరు 15 లోపు https://bvmap.org/ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.
ఏ పోటీ ఎలా?
పోస్టర్-1: జనరల్ థీమ్ (8వ తరగతి విద్యార్థులు ఇద్దరు మాత్రమే) జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు పోస్టరును తయారు చేసి రాష్ట్రస్థాయిలో ప్రదర్శించాలి.
టాపిక్: రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ (లేదా) బయోడైవర్సిటీ అండ్ సాయిల్ హెల్త్
పోస్టర్-2: విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ కృషి (9వ తరగతి విద్యార్థులు ఇద్దరు మాత్రమే) జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు పోస్టరును తయారు చేసి రాష్ట్రస్థాయిలో ప్రదర్శించాలి.
టాపిక్: సర్ స.వి.రామన్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ (లేదా) ఇండియన్ సైంటిఫిక్ అచీవ్‌మెంట్స్
లఘు చిత్రం: పదో తరగతి నుంచి ఇద్దరు విద్యార్థులు మాత్రమే అర్హులు. పాఠశాల, జిల్లాస్థాయి పరీక్షలకు సిలబస్ (పదో తరగతి గణితం, విజ్ఞాన శాస్తం (పీఎస్ అండ్ ఎన్‌ఎస్). సాంఘికశాస్త్రం (జియోగ్రఫీ అండ్ భారత్‌దర్శన్), విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి (బహులైచ్ఛిక ప్రశ్నలు)
రాష్ట్రస్థాయిలో: సులభ సూత్రాలను ఉపయోగించి రూట్2 విలువ కనుగొనుట (లేదా) ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుల పరిశోధనలు (17వ శతాబ్ద పూర్వం) నవంబరు 11వ తేదీ లోగా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బీవీఎంఏపీ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
దరఖాస్తు తేదీలు...
రిజిస్ట్రేషన్‌కు గడువు తేదీ: 2024 నవంబరు 15
పాఠశాల స్థాయి స్క్రీనింగ్ పరీక్ష (ఆన్‌లైన్): నవంబరు 20, 21, 22 తేదీల్లో..
జిల్లాస్థాయి పరీక్ష (ఆన్‌లైన్): డిసెంబరు 6
జిల్లాస్థాయి పరీక్షకు అర్హులు: పాఠశాల స్థాయిలో జరిగే స్క్రీనింగ్ పరీక్షలో జిల్లాస్థాయిలో మొదటి 20 స్థానాలు పొందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు.
రాష్ట్రస్థాయి పరీక్ష: డిసెంబరు 30న నిర్వహిస్తారు. (వేదిక: స్కూల్ ఆఫ్ ప్లానింగ్, విజయవాడ.)
రాష్ట్రస్థాయి పరీక్షకు అర్హులు: జిల్లాస్థాయి పోటీల్లో మొదటి, రెండు స్థానాలు పొందిన 8, 9, 10 తరగతి విద్యార్థులు.
Thanks for reading Kaushal Science Quiz 2024
No comments:
Post a Comment