PM Vidyalakshmi: పీఎం-విద్యాలక్ష్మికి కేంద్రం ఆమోదం
ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
దిల్లీ: విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం-విద్యాలక్ష్మి (PM Vidyalaxmi scheme) పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం-విద్యాలక్ష్మీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకు రుణం లభించనుంది. రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడిస్తూ.. ఎఫ్‌సీఐలో మూలధన అవసరాలకు రూ.10,700 కోట్లను కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
ఇది స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ
పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏటా 22లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఇది సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ అని మంత్రి తెలిపారు. రూ.8లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. రూ.10లక్షల వరకు రుణాలపై రూ.3శాతం వడ్డీరాయతీ కల్పించనున్నారు. ఏదైనా ప్రభుత్వ స్కాలర్‌షిప్ లబ్దిదారులు ఈ పథకానికి అనర్హులు. విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Thanks for reading PM vidyalakshmi: Center approves PM-Vidyalakshmi
No comments:
Post a Comment