RRC: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 5,647 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
అస్సాం రాష్ట్రం గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే… ఎన్‌ఎఫ్‌ఆర్ పరిధిలోని డివిజన్/ వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
డివిజన్/ వర్క్‌షాప్: కతిహార్ & తింధారియా, అలీపుర్‌దువార్, రంగియా, లుమ్‌డింగ్, టిన్‌సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్, దిబ్రూగర్, ఎన్‌ఎఫ్‌ఆర్ హెడ్ క్వార్టర్/ మాలిగావ్.
ఖాళీల వివరాలు:
* యాక్ట్ అప్రెంటిస్: 5,647 ఖాళీలు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ఎస్&టి, పర్సనల్, అకౌంట్స్, మెడికల్.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్‌టీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04-11-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 03-12-2024.
ముఖ్యాంశాలు:
* గువాహటిలోని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
* అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
RRC NCR Apprentice Recruitment Notification
Thanks for reading RRC NFR Apprentice Recruitment 2024: Apply Online for 5647 Posts, Check Eligibility and Other Details
No comments:
Post a Comment