AP Cabinet meeting Highlights @ 03.12.24

AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోద ముద్ర
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం డిసెంబర్ 3 (మంగళవారం) ఉదయం 11 గంటలకు సమావేశమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఈ కేబినెట్ మీటింగ్ జరింగింది.
జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యం జరిగిందని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. డీపీఆర్ స్తాయి దాటి పథకం ముందుకెళ్లట్లేదని అధికారుల్ని నిలదీశారు సీఎం. ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని ఢిల్లీలోనూ చెప్పుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
మిషన్ మోడ్ లో పనిచేస్తే పథకం ప్రయోజనాల్ని వేగంగా ప్రజలకు అందించవచ్చని మంత్రి నారా లోకేష్ అన్నారు. పథకాలు ప్రజలకు చేరువైయేందుకు అధికారులు దష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 10 అంశాలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ బేటీ ఆమోదం తెలిపింది.
ముఖ్యంగా కాకినాడు పోర్ట్ విషయంలో మంత్రివర్గం చర్చించింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్న సందర్భంగా పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ శాఖలో ఏ పనులు జరిగాయో పూర్తి వివరాలు తనకు కావాలని సీఎం కోరారు. మద్యం, ఇసుక మాఫియాలను అరికట్టామని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి వర్గం అమోదం తెలిపిన అంశాలు
పీఎం ఆవాస్ యోజన గిరిజన గహ పథకం అమలు
2024-29 సమీకృత పర్యాటక పాలసీకి ఆమోద ముద్ర
2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులు
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం
పొట్టి శ్రీరాములు వర్థంతి డిసెంబర్ 15ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఐటీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 ఆమోదం
ఏపీ టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ
ఏపీ మారిటైమ్ పాలసీ
Thanks for reading AP Cabinet meeting Highlights @ 03.12.24
No comments:
Post a Comment