Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 30, 2024

Bank Holidays In January 2025


 

Bank Holidays In January 2025 : జనవరి నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

కొత్త ఏడాది తొలి నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు

కొత్త ఏడాది (New Year 2025) మొదలవుతోంది. తొలి నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు (Bank holidays) ఉన్నాయి. వివిధ పండుగలు, విశేషమైన సందర్భాల కారణంగా జనవరిలో ( January ) చాలా రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో ముందుగా తెలుసుకుని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. అన్ని ప్రభుత్వ సెలవులు, అలాగే రాష్ట్రాలవారీగా మారే కొన్ని ప్రాంతీయ సెలవు రోజుల్లో కూడా బ్యాంకులను మూసివేస్తారు. ఈ ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.

జనవరిలో సెలవులు ఇవే..

జనవరి 1: బుధవారం- నూతన సంవత్సరాది

జనవరి 2: నూతన సంవత్సరం, మన్నం జయంతి

జనవరి 5: ఆదివారం

జనవరి 6: సోమవారం- గురుగోవింద్ సింగ్ జయంతి

జనవరి 11: శనివారం- మిషనరీ డే, రెండవ శనివారం

జనవరి 12: ఆదివారం- స్వామి వివేకానంద జయంతి

జనవరి 13: సోమవారం- లోహ్రి

జనవరి 14: మంగళవారం- మకర సంక్రాంతి, మాఘ బిహు, పొంగల్

జనవరి 15: బుధవారం- తిరువళ్లువర్ దినోత్సవం (తమిళనాడు), తుసు పూజ (పశ్చిమ బెంగాల్, అస్సాం)

జనవరి 16: ఉజ్జవర్ తిరునాల్

జనవరి 19: ఆదివారం

జనవరి 22: ఇమోయిన్

జనవరి 23: గురువారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

జనవరి 25: శనివారం- నాల్గవ శనివారం

జనవరి 26: ఆదివారం- గణతంత్ర దినోత్సవం

జనవరి 30: సోనమ్ లోసర్

దేశంలో రాష్ట్రాలవారీగా మారే జాతీయ సెలవులు, ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో పాటు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులను మూసివేస్తారు. బ్యాంకులు మూతపడినప్పటికీ కస్టమర్లు డిజిటల్‌గా వివిధ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు బ్యాంకు సెలవుల సమయంలో అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు తమ పనిని ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాయి.

రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి.

ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.

Thanks for reading Bank Holidays In January 2025

No comments:

Post a Comment