Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 11, 2024

Jio New Year Offer: Reliance Jio welcome plan


 

Jio Offer: జియో న్యూ ఇయర్‌ ఆఫర్‌.. JIO good news for the new year

Jio New Year Offer: Reliance Jio welcome plan: జియో నుంచి న్యూఇయర్‌ ప్లాన్‌.. ₹2,025 రీఛార్జిపై ₹2వేలు విలువైన ప్రయోజనాలు

Reliance Jio welcome plan: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో కొత్త టెలికాం ప్లాన్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘న్యూ ఇయర్‌ వెలకమ్‌ ఆఫర్‌ ప్లాన్‌ 2025’ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.

Reliance Jio welcome plan : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) కొత్త టెలికాం ప్లాన్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘న్యూ ఇయర్‌ వెలకమ్‌ ఆఫర్‌ ప్లాన్‌ 2025’ని (Reliance Jio welcome plan) కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2025 రీఛార్జిపై లాంగ్‌టర్మ్‌ వ్యాలిడిటీతో పాటు రూ.2,150 విలువైన కూపన్‌ ప్రయోజనాలనూ అందిస్తోంది.

రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన రూ.2025 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో రీఛార్జి చేసుకుంటే..200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమితి 5జీ డేటా ఇస్తోంది. రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 500 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు కూడా పొందొచ్చు. ఇవే ప్రయోజనాలతో వస్తున్న జియో నెలవారీ ప్లాన్‌తో పోలిస్తే ఈ ప్లాన్‌ ద్వారా రూ.468 ఆదా చేసుకోవచ్చని జియో చెబుతోంది. ప్రస్తుతం రూ.349 ప్లాన్‌తో ఇవే ప్రయోజనాలు లభిస్తున్నాయి. 200 రోజులకు ఈ విలువ రూ.2,493 అవుతుందని జియో చెబుతోంది.

ఇక ఈ ప్యాక్‌ కొనుగోలు చేసిన వారికి రూ.2150 విలువైన కూపన్లను జియో అందిస్తోంది. రూ.500 విలువైన అజియో కూపన్‌ను రూ.2,500, ఆపై కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చు. స్విగ్గీలో రూ.499 పైబడి చేసిన కొనుగోళ్లపై రూ.150 డిస్కౌంట్‌ ఇస్తోంది. ఈజ్‌ మై ట్రిప్‌లో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1500 డిస్కౌంట్‌ పొందొచ్చని జియో పేర్కొంది. ఈ ప్లాన్‌ డిసెంబర్‌ 11 నుంచి జనవరి 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. మై జియో యాప్‌ నుంచి గానీ, జియో అధికారిక వెబ్‌సైట్‌, రిటైలర్ల వద్ద రీఛార్జి చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

Thanks for reading Jio New Year Offer: Reliance Jio welcome plan

No comments:

Post a Comment