State Bank Of India 13735 Clerk Posts Recruitment Notification స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
SBI Clerk Recruitment 2024: ఎస్‌బీఐలో 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులు
మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? బ్యాంక్ జాబ్ చేయాలనేది మీ కోరికా? అయితే మీకు శుభవార్త. ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ ఖాళీలతో క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 342; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 17 నుంచి జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు....
పోస్టులు: జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్): 13,735 పోస్టులు
రాష్ట్రాల వారీగా ఖాళీలు: గుజరాత్- 1073, ఆంధ్రప్రదేశ్- 50, కర్ణాటక- 50, మధ్యప్రదేశ్- 1317, ఛత్తీస్‌గఢ్- 483, ఒడిశా- 362, హరియాణా- 306, జమ్ము & కశ్మీర్ యూటీ- 141, హిమాచల్ ప్రదేశ్- 170, చండీగఢ్ - 32, లడఖ్ యూటీ- 32, పంజాబ్- 569, తమిళనాడు- 336, పుదుచ్చేరి- 04, తెలంగాణ- 342, రాజస్థాన్- 445, పశ్చిమ బెంగాల్- 1254, అండమాన్ & నికోబార్ దీవులు- 70, సిక్కిం- 56, ఉత్తర్‌ప్రదేశ్- 1894, మహారాష్ట్ర- 1163, గోవా- 20, దిల్లీ- 343, ఉత్తరాఖండ్- 316, అరుణాచల్ ప్రదేశ్- 66, అస్సాం- 311, మణిపుర్- 55, మేఘాలయ- 85, మిజోరం- 40, నాగాలాండ్- 70, త్రిపుర- 65, బిహార్- 1111, జార్ఖండ్- 676, కేరళ- 426, లక్షద్వీప్- 02.
☛ హైదరాబాద్ సర్కిల్(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 342.
☛ అమరావతి సర్కిల్(ఆంధ్రప్రదేశ్)లో పోస్టుల సంఖ్య: 50.
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2024 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1996 - 01.04.2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
బేసిక్ పే: నెలకు రూ.26,730.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.
మెయిన్ ఎగ్జామ్: మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు... 50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు... 40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు... 50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు... 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో 179 మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.12.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.01.2025.
ప్రిలిమినరీ పరీక్ష: ఫిబ్రవరి 2025లో జరుగుతుంది.
మెయిన్ పరీక్ష తేది: మార్చి/ ఏప్రిల్ 2025లో జరుగుతుంది.
ముఖ్యాంశాలు:
❶ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ ఖాళీలతో క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
❷ ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది.
❸ అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 17 నుంచి జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
State Bank Of India 13735 Clerk Posts Recruitment Notification Download
Thanks for reading State Bank Of India 13735 Clerk Posts Recruitment Notification
No comments:
Post a Comment