Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 2, 2025

AP Cabinet meeting Highlights @ 02.01.25


 

AP Cabinet meeting Highlights @ 02.01.25


AP Cabinet: ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) ముగిసింది.. పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

అమరావతి: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది. మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది.

భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచేందుకు, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది

రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తున్నారు. నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చర్చ జరుగి నట్లు సమాచారం. 

Thanks for reading AP Cabinet meeting Highlights @ 02.01.25

No comments:

Post a Comment