Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, January 31, 2025

Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్ లో ధరలు తగ్గేవి...ధరలు పెరిగేవి ఇవే..(Cheaper & Costlier)


 

Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్ లో ధరలు తగ్గేవి...ధరలు పెరిగేవి ఇవే..(Cheaper & Costlier)



2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లోక్ సభలో బడ్జెట్ గురించి సుధీర్ఘ ప్రసంగం చేసిన నిర్మలా సీతారామన్..

పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం పలు సంస్కరణలకు నాంది పలుకుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు.. భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన కార్యక్రమం తీసుకొస్తున్నట్లు నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కోటి 70లక్షల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు నిర్మలాసీతారామన్‌. పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు మంజూరుచేస్తామన్నారు. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచుతున్నట్లు తెలిపారు. బీమాలో FDI 74 శాతం నుంచి 100 శాతానికి అనుమతి.. లక్ష ఇళ్ల నిర్మాణం కోసం రూ.15వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ప్రకటించారు. అలాగే 56 మందులపై కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. టీవీలు కూడా ఖరీదైనవిగా మారతాయి. మొబైల్‌లు, కెమెరాలు చౌకగా మారనున్నాయి.

ధరలు తగ్గే వస్తువులు ఇవే..

చేనేత వస్త్రాలు

తోలు వస్తువులు

మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ

ఎలక్ట్రిక్ వెహికల్స్

భారతదేశంలో తయారైన దుస్తులు

వైద్య పరికరాలు

క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు (క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో సహా మొత్తం 36 ప్రాణాలను రక్షించే మందులను ప్రాథమిక కస్టమ్స్ సుంకాల నుండి పూర్తిగా మినహాయించారు.)

లిథియం సహా పలు రకాల ఖనిజాలు

పెరగనున్న వస్తువుల ధరలు ఇవే..

అధిక సుంకాల కారణంగా టెలికాం పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. దీంతోపాటు.. టీవీల ధరలు సైతం పెరగనున్నాయి.

Thanks for reading Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్ లో ధరలు తగ్గేవి...ధరలు పెరిగేవి ఇవే..(Cheaper & Costlier)

No comments:

Post a Comment