Central Bank of India Zone Based Officer posts Recruitment Notification
CBI ZBO Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 266 జోన్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్… రెగ్యులర్ ప్రాతిపదికన వివిద జోనుల్లో 266 జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్ 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు/ గ్రేడ్:
* జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్ 1
జోనులు: అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అభ్యర్థులు కూడా అర్హులు.
వయోపరిమితి: 30.11.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ వారికి మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.48,480- రూ.85,920.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్‌టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్‌టీ).
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21.01.2025.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09.02.2025.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి 2025.
ముఖ్యాంశాలు:
* సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ జోన్‌లలో జోన్ బేస్డ్ ఆఫీసర్- జేఎంజీఎస్ స్కేల్ 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Central Bank of India Zone Based Officer posts Recruitment Notification
Thanks for reading Central Bank of India Zone Based Officer posts Recruitment Notification
No comments:
Post a Comment