Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 16, 2025

RIMC January 2026 notification out; exams to be held in June


RIMC January 2026 notification out; exams to be held in June

 RIMC: ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు 

భార‌త ప్రభుత్వ ర‌క్షణ మంత్రిత్వశాఖ‌కు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జనవరి- 2026 ట‌ర్మ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన బాలురు, బాలికల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. రాత ప‌రీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.

వివ‌రాలు..

☞ ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు జనవరి- 2026 టర్మ్‌

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2026 జనవరి 1 నాటికి ఏడో త‌ర‌గ‌తి చదువుతున్న లేదా ఎడో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 

వ‌య‌సు: 01.01.2025 నాటికి ప‌ద‌కొండున్నర ఏళ్లకు త‌గ్గకుండా ప‌ద‌మూడేళ్లకు మించ‌కుండా ఉండాలి. 02.01.2013 - 01.07.2014 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, వైవా వోస్‌, మెడిక‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక  ప్రక్రియ ఉంటుంది.

ప‌రీక్షా విధానం: రాత ప‌రీక్షలో మొత్తం మూడు పేప‌ర్లు ఉంటాయి.అవి

1. మ్యాథ‌మేటిక్స్‌ (200 మార్కులు)

2. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ (75 మార్కులు)

3. ఇంగ్లిష్ (125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు వైవా వోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్‌ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో క‌నీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి‌. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు చివ‌రిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రం: దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆర్ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి సంబంధిత స్టేట్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కార్యాలయానికి పంపించాలి. 

ముఖ్యమైన తేదీలు:

☞ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: 31.03.2025.

☞ ప‌రీక్ష తేదీ: 01-06-2025.

RIMC January 2026 Term Notification

Official Website

Thanks for reading RIMC January 2026 notification out; exams to be held in June

No comments:

Post a Comment