Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 2, 2025

Today is Savitri Baipule Jayanti.


సావిత్రి బాయిపూలే జయంతి నేడు.

జనవరి 3 ను భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆమె గొప్పతనం మనం తెలుసు కోవలసిందే..

మనదేశంలో మొదటి మహిళా  ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే.  

మన రాష్ట్ర ప్రభుత్వం ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినల సత్కారం  ఏర్పాటుచేయడం  ముదావహం.

అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా  పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే  .

ఈమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి.

 ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య.

కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.

ఆమె ఆధునిక విద్య  ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి  భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా,

పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, 

అస్పృశ్యుల, 

మహిళల 

సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ  సామాజిక  బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. 

నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.

సావిత్రి బాయి మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది.* ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో , అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. 

బోధన్ ప్రాంతపు మున్నూరు కాపులు వీరికి చుట్టాలు. 

సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు.

సావిత్రి బాయి "జ్యోతీరావు ఫూలె" ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. 

సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. 

కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 

1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు , దళితుల, స్త్రీల విద్యా  వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. 

వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు. 

ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. 

జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. 

మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో "సత్యాన్ని" శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేఖంగా బలమైన ఉధ్యమం నడిపారు.

 బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు.

 గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు.

 వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. 

తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈసత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 

1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.

1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 

1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువువాతపడిన కుటుంబాలలోని  అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు.

 తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. 

సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 

1854లోనే ఆమె తన కవితాసంపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించింది. 

మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్‌ రత్నాకర్‌’ను 1891లో ప్రచురించింది.

ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.

జ్యోతీరావుపూలే. 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. 

ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. 

ఫూలే మరణాంతరం సత్యసోధాక్ సమాజ్ భాద్యతనీ స్వీకరించి నడిపించింది.

 1897 లో ప్లేగు వ్యాధి, పూణేనగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.

ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో కబళించింది. 

ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించాడు.

 సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలతో.....

Thanks for reading Today is Savitri Baipule Jayanti.

No comments:

Post a Comment