TTD: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల నేడు
ఏప్రిల్‌కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్ల కోటాను శనివారం ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
తిరుమల, న్యూస్‌టుడే: ఏప్రిల్‌కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్ల కోటాను శనివారం ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవల లక్కీ డిప్ కోసం ఈనెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇదే రోజు మధ్యాహ్నం మూడింటికి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను విడుదల చేయనున్నారు.
23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం మూడింటికి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, అద్దె గదుల బుకింగ్ కోటా మధ్యాహ్నం మూడింటికి ఉంటుంది.
27న శ్రీవారి సాధారణ, నవనీత, పరకామణి సేవల కోటాలు ఉదయం 11, మధ్యాహ్నం 12, ఒంటి గంటకు విడుదల చేస్తారు. భక్తులు గమనించి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.
Thanks for reading TTD Alert: Alert for Shrivari Devotees.. Special Darshan tickets released... Book like this..
No comments:
Post a Comment