Excessive Sleepiness: రోజంతా నిద్ర మత్తుగా, అలసటగా ఉంటుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..
ఒక్కోసారి ఏ పని చేయకపోయినా విపరీతమైన అలసట కమ్మేస్తుంటుంది. అలాగే రోజంత మత్తుగా ఉంటుంది. దీంతో కొంత మంది రోజంతా అలా నిద్రపోతూ ఉంటారు. అయితే అసలిలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలియదు. ఇదేదో మామూలు విషయంగా భావించి లైట్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా జరగడానికి ప్రధాన కారణం ముఖ్యమైన పోషకాలు ఒంట్లో లోపించడమేనని నిపుణులు అంటున్నారు..
ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కానీ అందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. కఠినమైన జీవనశైలిని అవలంబించవలసి ఉంటుంది. ప్రతిరోజూ ఈ విధమైన దినచర్యను కొనసాగించవల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆహారంలో అన్ని రకాల విటమిన్లు సరైన మొత్తంలో తీసుకోవాలి. దీనిలో ఏదైనా లోపం తలెత్తితే వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని విటమిన్లు సరైన మొత్తంలో ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యమైన విటమిన్ల లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ లోపం వల్ల కలిగే సమస్యలలో నిద్ర సమస్యలు ఒకటి. రోజంతా నిద్రపోవడం వల్ల కూడా ఒక రకమైన విటమిన్ లోపం వల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏ విటమిన్ వల్ల ఇలా జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
మీకు విటమిన్ బి12 లోపం ఉందో లేదో ఎలా తెలుస్తుంది?
విటమిన్ బి12 ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది శరీరంలోని వివిధ అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే శరీరంలో దీని కొరత లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ విటమిన్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందో వంటి విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే.. సాధారణంగా శరీరంలో విటమిన్ బి12 లోపం తలెత్తితే రోజంతా అలసటగా ఉంటుంది. ఎటువంటి కఠినమైన పని చేయకపోయినా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. పైగా రోజంతా నీరసంగా అనిపిస్తుంది. మీకూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
అంతే కాదు, ఈ విటమిన్ లేకపోవడం వల్ల మానసిక స్థితిలో కూడా పలు మార్పులు వస్తాయి. అలాగే జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వెంటాడుతాయి. అలాగే, జ్ఞాపకశక్తి రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట అలసట, అధిక చెమటలు పట్టడం కూడా విటమిన్ బి12 లోపం వల్ల సంభవించే లక్షణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ విటమిన్ లోపం కండరాలను బలహీనపరుస్తుంది. ఇది నిరాశ, నిస్పృహలకు కూడా దారితీస్తుంది. కాబట్టి, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Thanks for reading Excessive Sleepiness: రోజంతా నిద్ర మత్తుగా, అలసటగా ఉంటుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..
No comments:
Post a Comment