Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, February 8, 2025

Promissory note: Are you borrowing money and taking a promissory note?


 Promissory Note: డబ్బులు అప్పు ఇచ్చి ప్రామిసరీ నోట్ తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

ప్రామిసరీ నోట్ అనేది ఒక చట్టబద్ధమైన ఆర్థిక పత్రం. ఇది రుణదాత, రుణ గ్రహీత మధ్య లిఖితపూర్వక ఒప్పందం. దీని ద్వారా రుణ గ్రహీత నిర్దిష్ట సమయానికి నిర్దిష్ట మొత్తం చెల్లించేందుకు హామీ ఇస్తాడు.

ఈ పత్రానికి చట్టపరమైన విలువ ఉండటం వల్ల ఇది రుణదాతకు భద్రతను కల్పిస్తుంది.

ప్రామిసరీ నోట్ వల్ల ఉపయోగాలు:

Loan security: రుణ గ్రహీత తన రుణాన్ని తిరిగి చెల్లించేందుకు లిఖితపూర్వకంగా హామీ ఇస్తాడు.

Legal basis: ఇది కోర్టులో చెల్లుబాటు అయ్యే పత్రం కావడంతో, రుణం తిరిగి పొందేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

Use for personal and business loans: ఇది వ్యక్తిగత రుణాలు, వ్యాపార లావాదేవీలలో, బ్యాంక్ రుణాల కోసం ఉపయోగిస్తారు.

Financial transaction clarity: ఇది రుణ పరిమాణం, చెల్లింపు తేదీ, వడ్డీ రేటు లాంటివి నిర్దిష్టంగా ప్రస్తావించటం వల్ల ఎవరికీ సందేహం ఉండదు.

ప్రామిసరీ నోట్ పోగొట్టుకుంటే ఏమవుతుంది?

ప్రామిసరీ నోట్ కోల్పోతే రుణదాతకు తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఇది చట్టబద్ధమైన ఒప్పందం కనుక, దాన్ని కోర్టులో రుజువు చేయడం చాలా కష్టం అవుతుంది.

Problems Encountered: ఒకవేళ ప్రామిసరీ నోటు పోయినట్లు అయితే రుణ గ్రహీత చెల్లింపుని తిరస్కరించవచ్చు. వ్యక్తి తీసుకున్న అప్పుకు రుజువుగా ప్రామిసరీ నోట్ ఇస్తే, ఆ ప్రామిసరీ నోట్ పోగొట్టుకుంటే గనుక అప్పు తీసుకున్న వ్యక్తి రుణాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. అప్పుడు చట్టపరమైన ఆధారం లేకపోవడం వల్ల, తన డబ్బును తిరిగి పొందడం కష్టం అవుతుంది.

Legal Proof Required: కోర్టులో కేసు వేసినప్పటికీ, ప్రామిసరీ నోట్ ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే, అది నకిలీ కాదని నిరూపించేందుకు అదనపు సాక్ష్యాలు అవసరం అవుతాయి. రుణదాతకు ఎలాంటి అదనపు రికార్డులు లేకుంటే, కోర్టు కేసు బలహీనంగా మారుతుంది. కొంతమంది, ఒరిజినల్ ప్రామిసరీ నోట్ పోగొట్టుకున్నట్లయితే, దాని జీరోక్స్ కాపీ లేదా బ్యాంక్ లావాదేవీల రికార్డులను కోర్టుకు సమర్పించాల్సి వస్తుంది. కానీ ప్రామిసరీ నోటుని కోర్టు సెకండరీ సాక్ష్యంగానే పరిగణిస్తుంది.

Thanks for reading Promissory note: Are you borrowing money and taking a promissory note?

No comments:

Post a Comment