Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, February 24, 2025

UPSC recruitment: 705 Combined Medical Services Posts in UPSC


 UPSC Recruitment: యూపీఎస్సీలో 705 కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్ పోస్టులు 

 

దేశంలో మేటి కేంద్ర కొలువులకు చిరునామా.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ). ముఖ్యమైన ఉద్యోగ నియామకాలన్నీ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఏటా క్యాలెండర్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించడం యూపీఎస్‌సీ ప్రత్యేకత. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్, ఎకనామిక్‌ సర్వీస్, స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు ఈ సంస్థ ప్రకటనలు విడుదలచేసింది. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి మేటి హాదా, ఆకర్షణీయ వేతనం రెండూ దక్కుతాయి. 

సీఎంఎస్, ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌.. ఎందులో అవకాశం వచ్చినా లెవెల్‌-10 హోదా దక్కుతుంది. వీరికి రూ.56,100 మూల వేతనం అందుతుంది. అలాగే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం పొందవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌లకు దాదాపు సివిల్‌ సర్వెంట్లకు ఉన్న ప్రాధాన్యం దక్కుతుంది. సీఎంఎస్‌లో సేవలు అందించేవారికి వేతనంతోపాటూ నాన్‌ ప్రాక్టీస్‌ అలవెన్సు (ఎన్‌పీఏ) చెల్లిస్తారు.    

పోస్టుల వివరాలు: 

1. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్ (సీఎంఎస్‌)- 705 పోస్టులు

 ఎంబీబీఎస్‌ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నవారికి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) చక్కని అవకాశం. జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హోదాతో సేవలు అందించవచ్చు. భవిష్యత్తులో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్, ఆపై స్థాయికీ చేరుకోవచ్చు.  

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష 500 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు. ఒక్కో పేపర్‌లోనూ 120 ప్రశ్నలు వస్తాయి. ఒక్కోదాని వ్యవధి 2 గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. 

విజయానికి: ఎంబీబీఎస్‌ సిలబస్‌పై గట్టి పట్టున్నవారు సీఎంఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలరు. పరీక్షలో విజయానికి గతంలో నిర్వహించిన సీఎంఎస్, నీట్‌ పీజీ, ఐఎన్‌ఐ సెట్‌ ప్రశ్నపత్రాల అధ్యయనం ఉపయోగపడుతుంది. 

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. కోర్సు తుదిదశలో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: ఆగస్టు 1, 2025 నాటికి 32 ఏళ్లకు మించరాదు. సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌ పోస్టులకు 35 ఏళ్ల వరకు అవకాశం.

దరఖాస్తు గడువు తేదీ: 11.03.2025.

పరీక్ష తేదీ: 20.07.2025.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.  

2. ఇండియన్‌ స్టాటి స్టికల్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌): 35 ఖాళీలు 

 స్టాటిస్టిక్స్‌లో మేటి భవిష్యత్తు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ఇండియన్‌ స్టాటి స్టికల్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌) ముఖ్యమైంది. జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. నేషనల్‌ స్టాటిస్టికల్, సెంట్రల్‌ స్టాటిస్టికల్, నేషనల్‌ శాంపిల్‌ కార్యాలయాల్లో విధులుంటాయి. గ్రూప్‌ ఎ విభాగంలో క్లాస్‌-1 అధికారిగా కొనసాగుతారు. భవిష్యత్తులో సీనియర్, చీఫ్‌ ఆఫీసర్‌ హోదాలు దక్కుతాయి.

ఎంపిక: పరీక్షలో 2 భాగాలున్నాయి. పార్ట్‌ 1లో వెయ్యి మార్కులకు 6 పేపర్లు రాయాలి. వీటిలో జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపరు వంద మార్కులకు ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. స్టాటిస్టిక్స్‌ 1, 2 పేపర్లు ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 2 గంటలు. స్టాటిస్టిక్స్‌ 3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. ఒక్కో స్టాటిస్టిక్స్‌ పేపరు (1,2,3,4)కు 200 మార్కులు. స్టాటిస్టిక్స్‌ 1, 2 పేపర్లలో 80 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉన్న 3, 4 పేపర్లలో సగం ప్రశ్నలు షార్ట్‌ ఆన్సర్, చిన్న సమస్యల రూపంలో ఉంటాయి. మిగతా సగంలో లాంగ్‌ ఆన్సర్, కాంప్రహెన్షన్‌ ప్రాబ్లమ్‌ ప్రశ్నలు వస్తాయి. 

 ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. సమాధానాలూ ఆ భాషలోనే రాయాలి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్‌-1లో అర్హత సాధిస్తేనే పార్ట్‌-2 ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి 200 మార్కులు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన తుది మార్కులతో నియామకాలుంటాయి.  

అర్హత: స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ వీటిలో ఎందులోనైనా యూజీ/ పీజీ ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

3. ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌): 12 ఖాళీలు

 కేంద్ర ఆర్థిక సర్వీసుల్లో అత్యున్నత హోదాలో సేవలందించాలనే లక్ష్యం ఉన్నవారికి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) దారి చూపుతుంది. జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, అనుబంధ విభాగాల్లో విధులుంటాయి. గ్రూప్‌ ఎ విభాగంలో క్లాస్‌-1 అధికారిగా కొనసాగుతారు. అనుభవం, పనితీరుతో సీనియర్‌ ఆఫీసర్, చీఫ్‌ ఆఫీసర్, ఆపై హోదాలకు చేరుకోవచ్చు. 

ఎంపిక: పరీక్షలో 2 భాగాలుంటాయి. పార్ట్‌ 1లో 6 పేపర్లు రాయాలి. వీటికి వెయ్యి మార్కులు. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపర్‌కూ వంద మార్కులు. జనరల్‌ ఎకనామిక్స్‌ 1,2,3 పేపర్లతోపాటు, ఇండియన్‌ ఎకనామిక్స్‌ ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. ప్రతి పేపర్‌ వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. సమాధానాలూ అదే భాషలో రాయాలి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్‌ 1లో అర్హత సాధించినవారు పార్ట్‌ 2 ఇంటర్వ్యూకు హాజరవుతారు. దీనికి 200 మార్కులు.. మొత్తం 1200 మార్కుల్లో అభ్యర్థి ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు. 

అర్హత: ఎకనామిక్స్‌/ అప్లైడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ ఎకనోమెట్రిక్స్‌ వీటిలో ఎందులోనైనా పీజీ పూర్తిచేసినవారు, ప్రస్తుతం చివరి ఏడాదిలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఎస్‌ఎస్, ఐఈఎస్‌ (రెండు పోస్టులకూ)...

వయసు: ఆగస్టు 1, 2025 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 2, 1995 - ఆగస్టు 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 4 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

పరీక్షలు: జూన్‌ 20 నుంచి మొదలవుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.

Online Application for Combined Medical Services Examination, 2025

Online Application for IES, ISS Examination, 2025

Official Website

Thanks for reading UPSC recruitment: 705 Combined Medical Services Posts in UPSC

No comments:

Post a Comment