Ugadi Horoscope: శుభం భూయాత్.. విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలు
ఈ ఏడాది ఏ రాశివారికి ఎలా ఉంటుందంటే..
ఆదాయం: 2; వ్యయం: 14 రాజపూజ్యం: 5; అవమానం: 7
అదృష్టయోగం 75 శాతం మేర ఉంది. శుభాలు చేకూరతాయి. అనుకున్నది సాధిస్తారు. ఆదాయం బావుంటుంది. అంతకు చాలా రెట్లు వ్యయాలూ ఉంటాయి. కాబట్టి, జాగ్రత్తగా ఖర్చు చేయాలి. పొదుపు- మదుపు అవసరాన్ని తెలుసుకోవాలి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను చిన్నచూపు చూసేవారూ ఉన్నారు. మానవ సంబంధాల విషయంలో సున్నితంగా వ్యవహరించాలి. ప్రేమగా సంభాషించాలి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుతాయి. గురువు ద్వితీయ స్థానంలో ఉన్న సమయంలో రాబడికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. కాకపోతే, ఈ ఏడాది రెండో భాగంలో గురుబలం తక్కువగా ఉంది. దీంతో, కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలూ, వ్యాపారులకు అనుకోని అవాంతరాలూ ఎదురుకావచ్చు. బుద్ధిబలంతో వాటిని అధిగమించాలి. మేషరాశి వారికి ఏలినాటి శని ఇప్పుడే మొదలైంది. ఆ ప్రభావం రకరకాలుగా ఉంటుంది. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. బంధుమిత్రుల విషయంలో అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. ఈ రాశిలోని విద్యార్థులు పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. రాహువు ఏకాదశంలో ఉన్నప్పుడు అనూహ్యమైన సంపదలు సమకూరుతాయి. పంచమ కేతువులో ఖర్చులు ఆదాయానికి మించిపోతాయి. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. నవగ్రహ స్తోత్రాలు జపించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే వారం - ఆదివారం, రంగులు - ఎరుపు, గులాబీ. అదృష్ట దైవం సూర్యుడు.
ఆదాయం: 11; వ్యయం: 5 రాజపూజ్యం: 1; అవమానం: 3
ఉత్తమకాలం నడుస్తోంది. నూటికి నూరుశాతం అదృష్టయోగం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా, నలుగురిలో గుర్తింపును పొందుతారు. ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఇబ్బందులు తొలగిపోతాయి. చేపట్టిన పనులన్నీ కొలిక్కి వస్తాయి. ఆకాంక్షల్ని నిజం చేసుకుంటారు. ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి. దశమ స్థానంలో రాహువు వల్ల ఉద్యోగంలో పదోన్నతులు వరిస్తాయి. ఈ ఏడాది రెండో భాగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గురుబలం అనుకూలిస్తుంది. శుభకార్యాలు చేపడతారు. ఏకాదశంలో శని సంచారం కారణంగా అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అభీష్ట సిద్ధి ఉంది. సంపదలు పెరుగుతాయి. గౌరవం ఇనుమడిస్తుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. స్తోమతకు మించిన ఖర్చులు చేయకండి. అపాత్రదానం వల్ల కష్టార్జితం వృథా అవుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రతతో అగ్రస్థానానికి చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభావంతులను కొత్త అవకాశాలు వరిస్తాయి. వ్యాపారులు తమ కార్యకలాపాల విస్తరణకు అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి శని సానుకూల ప్రభావంతో ఘన విజయం వరిస్తుంది. ఎంతోకాలం నుంచీ వేధిస్తున్న సమస్యలు ఈ ఏడాది పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6, కలిసొచ్చే వారం - బుధవారం, రంగులు - తెలుపు, ఆకుపచ్చ. అదృష్ట దైవం విష్ణుమూర్తి.
ఆదాయం: 14; వ్యయం: 2; రాజపూజ్యం: 4; అవమానం: 3
ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు బాధించవు. అదృష్టయోగం 75 శాతం మేర ఉంది. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అక్టోబరు నుంచి డిసెంబరు తొలివారం వరకూ గురుబలం అపారం. ఆ ప్రభావం శుభాలను ప్రసాదిస్తుంది. ధన స్థానంలో గురువు ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తాడు. కాకపోతే, సెప్టెంబరు దాకా గురుబలం సహకరించదు. అందుకే, ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ముఖ్యమైన పనుల్లో మరింత శ్రద్ధ అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. మానవ సంబంధాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆచితూచి మాట్లాడాలి. దశమంలో శని కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అవరోధాలు ఎదురుకావచ్చు. కాబట్టి, ఎరుకతో విధులు నిర్వర్తించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. రాహువు దశమంలో అనేక లాభాలను ప్రసాదిస్తాడు. కాకపోతే, నవమంలో నష్టాలు ఎదురుకావచ్చు. వాటిని అధిగమించడానికి ఆధ్యాత్మిక సంపత్తి అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శించండి. పూజాదికాలకు సమయం కేటాయించండి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు తలుపుతడతాయి. సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో బుద్ధిబలం అవసరం. ఓ లావాదేవీలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. అనూహ్యమైన ఆర్థిక విజయం వరిస్తుంది. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి. ఈ ఏడాది గురువు శుభదృష్టితో భారీ లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల వేగానికి పరిమితి అవసరం. ఆత్మీయుల మనసు కష్టపెట్టొద్దు. శని ప్రభావాన్ని తగ్గించుకోడానికి, శనిగ్రహ శ్లోకం చదువుకోవాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5, కలిసొచ్చే వారం - శుక్రవారం, రంగులు - తెలుపు, ఆకుపచ్చ. అదృష్ట దైవం లక్ష్మీదేవి.
ఆదాయం: 8; వ్యయం: 2; రాజపూజ్యం: 7; అవమానం: 3
ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. అదృష్టయోగం యాభైశాతం మేర ఉంది. మిగిలిన సగాన్నీ ఆత్మబలంతో సొంతం చేసుకోవచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఒకట్రెండు అవమానాలూ ఉంటాయి. ముఖ్యమైన పనులను ప్రణాళిక ప్రకారం ప్రారంభించండి. ప్రతి ప్రయత్నంలోనూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. అభీష్టసిద్ధి కలుగుతుంది. సంవత్సరంలోని తొలిభాగంలో ఏకాదశ బృహస్పతి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు, వరుస విజయాలను అందిస్తాడు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోడానికి ఇదే సరైన సమయం. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. మే 14 తర్వాత గురుబలం తగ్గుతుంది. కాబట్టి, విధి నిర్వహణలో ఏకాగ్రత పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ వద్దు. నిర్లిప్తత అసలు పనికిరాదు. సంపూర్ణ బాధ్యతతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఒంటరి పోరాటంతో ఉపయోగం లేదు. నలుగురితో కలిసి ముందుకెళ్లండి. వృత్తి నైపుణ్యానికి పదును పెట్టుకోవాలి. శని, రాహువు పెద్దగా సహకరించడం లేదు. ఏ విషయాన్నీ మనసులోకి తీసుకోవద్దు. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది. ఆలోచనల్లో అస్థిరత్వం వద్దు. ఉత్తరార్ధంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆరంభంలోనే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం మేలు. వృథా ఖర్చులను పరిహరించండి. జూదాల జోలికి వెళ్లకండి. స్థిరాస్తులను జాగ్రత్తగా కాపాడుకోండి. ముఖ్య నిర్ణయాల విషయంలో స్థిరంగా వ్యవహరించండి. బుద్ధిబలానికి ప్రాధాన్యం ఇవ్వండి. మంచిచెడుల బేరీజు సమయంలో అంతరాత్మ ప్రబోధానికి కట్టుబడి ఉండండి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ రాశివారు శని, రాహువులు సృష్టించే ఇబ్బందులను ఆత్మస్థైర్యంతో అధిగమించాలి. పరమాత్మ ధ్యానాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. అనుకూల ఫలితాల కోసం శని, రాహువు స్తోత్రాలు పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2, కలిసొచ్చే వారం - మంగళవారం, రంగులు - తెలుపు, ఎరుపు. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు.
ఆదాయం:11; వ్యయం:11 రాజపూజ్యం:3; అవమానం: 6
ఆదాయం బావుంటుంది. దాంతోపాటే ఖర్చులూ ఉంటాయి. అదృష్టయోగం పావు శాతం మాత్రమే ఉంది. అయినా, నిరాశపడాల్సిన పన్లేదు. ఆత్మబలంతో సవాళ్లను అధిగమించవచ్చు. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. స్థిర-చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఈ ఏడాది రాజపూజ్యం కంటే అవమానమే అధికం. ఎరుకతో వ్యవహరించడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. సాధ్యమైనంత వరకూ వివాదాలకు దూరంగా ఉండాలి. శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. సంవత్సర ఆరంభంలో గురుబలం తక్కువగా ఉన్నా, మే 14 నుంచి ఏకాదశ స్థానంలోని గురువు తిరుగులేని విజయాలను ప్రసాదిస్తాడు. జీవిత లక్ష్యాలు నెరవేరతాయి. పిల్లల విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి. చక్కగా వృద్ధిలోకి వస్తారు. కొత్త ప్రయత్నాలు అనూహ్యమైన లాభాలను అందిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. అక్టోబరు 18 నుంచి డిసెంబరు 5 వరకూ మరింత ఏకాగ్రతతో పనిచేయాలి. ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యాజ్యాలకు ఆస్కారం ఉంది. సింహరాశి వారికి అష్టమ శని మొదలైంది. శని అష్టమంలో ఉండటం వల్ల బంధాల విషయంలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. స్నేహాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురి కావద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రాహుకేతువులు సహకరించడం లేదు కాబట్టి, ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. తీవ్ర నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు మేలైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంది. వ్యాపారంలో అస్థిరత తొలగుతుంది. శని, రాహు-కేతు శ్లోకాలు చదువుకోవాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1, కలిసొచ్చే వారం - గురువారం, రంగులు - గులాబీ, పసుపు. అదృష్ట దైవం శివుడు.
ఆదాయం:14; వ్యయం: 2 రాజపూజ్యం: 6; అవమానం: 6
పరిపూర్ణమైన అదృష్టయోగం ఉంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. గణనీయమైన ఆదాయం లభిస్తుంది. ఖర్చులు మాత్రం అత్యల్పం. తిరుగులేని లాభాలను గడిస్తారు. కాకపోతే, ఆ సంపాదనను పొదుపు-మదుపు రూపంలో భద్రపరచాలి. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించాలి. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. భాగ్య బృహస్పతి యోగం సకల శుభదాయకం. స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సాధిస్తారు. రేపటి అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మే 14 నుంచి అక్టోబరు వరకూ ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. విధి నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం. సకాలంలో బాధ్యతలనూ, లక్ష్యాలనూ పూర్తి చేయాలి. ఏకాదశంలో గురువు మనోవాంఛల్ని నెరవేరుస్తాడు. శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలను పరిహరించాలి. రాహువు సప్తమంలో కొన్ని ఇబ్బందులు సృష్టించినా, షష్ఠ స్థానంలో మాత్రం శుభాన్ని ఇస్తాడు. కేతువు పెద్దగా సహకరించకపోవచ్చు. ఆధ్యాత్మిక బలం కోసం పరమాత్మను ధ్యానించాలి. పిల్లల ఎదుగుదల సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. యాజమాన్యాల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు తమ కార్యకలాపాల్ని నలుదిక్కులకూ విస్తరిస్తారు. క్రమశిక్షణ, మనోబలం చాలా అవసరం. ఆలోచనలు దారితప్పకుండా చూసుకోవాలి. గ్రహయోగం సంపూర్ణంగా ఉండటం వల్ల, ప్రత్యేకమైన శాంతులు అవసరం లేదు. కానీ, ప్రత్యేక సందర్భాల్లో ఆలయాల్ని సందర్శించాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5, కలిసొచ్చే వారం - శనివారం, రంగులు - ఆకుపచ్చ, నీలం. అదృష్ట దైవం శివుడు.
ఆదాయం:11; వ్యయం: 5 రాజపూజ్యం: 2; అవమానం: 2
ఆదాయం బావుంటుంది. నూటికి నూరుశాతం అదృష్టయోగం ఉంది. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా సమాజంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. వరుస విజయాలు సాధిస్తారు. సునాయాసంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మే 14 నుంచి గురుగ్రహం అపారమైన భాగ్యాన్నీ, అనంతమైన అదృష్టాన్నీ ప్రసాదిస్తుంది. చక్కని ప్రణాళిక ద్వారా విజయాలు వరిస్తాయి. ఏకాగ్రతతో ఉద్యోగ జీవితంలో ప్రగతిని సాధిస్తారు. షష్ఠమ స్థానంలో శని విజయాన్నీ, సౌఖ్యాన్నీ ప్రసాదిస్తాడు. అదే స్థానంలో రాహువు అభీష్ట సిద్ధినిస్తాడు. కానీ, ఆ రాహువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు, ఆర్థిక నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి. కేతువు వల్ల ద్వాదశ స్థానంలో వ్యయాలు ఉన్నా, ఏకాదశ స్థానంలో సౌభాగ్యం సిద్ధిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో, పోటీ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలుస్తారు. నిపుణులు వృత్తి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొత్త ప్రయత్నాలకూ, సృజనాత్మక ప్రయోగాలకూ అనువైన సమయం. ఉద్యోగులు పదోన్నతులు సాధిస్తారు. ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుకుంటారు. వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తీవ్ర పోటీని తట్టుకుని ప్రత్యర్థులపైన విజయం సాధిస్తారు. ప్రజా జీవితంలో ఉన్నవారిని గెలుపు వరిస్తుంది. సంపూర్ణ గ్రహ యోగం కారణంగా శాంతులూ, ప్రత్యేక పూజలూ అవసరం లేదు. ఇష్టదైవాన్ని పూజించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6, కలిసొచ్చే వారం - శనివారం, రంగులు - ఎరుపు, పసుపుపచ్చ. అదృష్ట దైవం శివుడు.
ఆదాయం:2; వ్యయం: 14 రాజపూజ్యం: 5; అవమానం: 2
కొత్త అవకాశాలు తలుపు తడతాయి. అదృష్టయోగం పరిపూర్ణం. ఆదాయం స్వల్పంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికం. గ్రహబలం పూర్తిగా సహకరిస్తున్నందున అవకాశాలు వెన్నంటి ఉంటాయి. అనవసరమైన ఖర్చుల్ని పరిహరించాలి. ఉన్నంతలో పొదుపు చేసుకోవాలి. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించాలి. అవమానం కంటే రాజపూజ్యమే అధికం. దీంతో సమాజంలో తగిన గుర్తింపును పొందుతారు. సప్తమ బృహస్పతి యోగం శుభాలను ప్రసాదిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబపరంగా కలిసొస్తుంది. భార్యాపిల్లలకు మేలు జరుగుతుంది. మే 14 నుంచి గురువు అష్టమ స్థానంలో ఉంటాడు. ఆ ఫలితాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి, సుదూర ప్రయాణాలు చేయకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తృతీయ రాశిలో బృహస్పతి సంచారం సౌభాగ్యదాయకం. నవమ స్థానంలో గురువు సంచారం మేలు చేస్తుంది. అయితే శని, రాహువులు పెద్దగా సహకరించడం లేదు. ఆత్మబలంతో ఆ పరిమితిని అధిగమించాలి. ప్రణాళికతో పనులు పూర్తి చేసుకోవాలి. చర్చలూ, సంప్రదింపుల సమయంలో ఉద్వేగాలపైన నియంత్రణ కోల్పోకూడదు. శాంతంగా వ్యవహరించాలి. మిత భాషణం అన్ని విధాలా ఉత్తమం. కేతువు ఏకాదశ స్థానంలో సిరిసంపదల్ని అందిస్తాడు. దశమ స్థానంలో లాభాలనూ, పదోన్నతులనూ ప్రసాదిస్తాడు. సంపాదన కొంతమేర పెరుగుతుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారులు ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. గణపతిని ప్రార్థించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే వారం - గురువారం, రంగులు - ఎరుపు, పసుపుపచ్చ. అదృష్ట దైవం శివుడు.
ఆదాయం: 5; వ్యయం: 5 రాజపూజ్యం: 1; అవమానం: 5
ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అదృష్టయోగం 75 శాతం మేర ఉంది. జీవిత లక్ష్యాల్ని సాధించడానికి అనువైన కాలం. అయితే, ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. అప్పుడే, సత్ఫలితాలను సాధిస్తారు. ఈ ఏడాది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. కొన్ని చరాస్తులనూ సమకూర్చుకుంటారు. గృహ నిర్మాణం చేపడతారు. భూ లాభం సైతం గోచరిస్తోంది. మే 14 నుంచి గురుబలం సంపూర్ణంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో భాగస్వాముల ప్రోత్సాహం అందుతుంది. వృత్తి నిపుణులు గౌరవ పురస్కారాలు అందుకుంటారు. సంవత్సరం ప్రారంభంలోనూ, చివర్లోనూ గురుబలం పెద్దగా సహకరించదు. కాబట్టి, ఏ పనినైనా లోతుగా ఆలోచించే చేయాలి. ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం కూడా మొదలవుతోంది. అందువల్ల, కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి. బంధాలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదు. ఒకట్రెండు అవరోధాలు ఎదురైనా ఒత్తిడికి గురికాకూడదు. సంయమనంతో స్పందించాలి. రాశుల ప్రభావం వల్ల శత్రువుల తాకిడి కొంత ఎక్కువగానే ఉంటుంది. మీ విజయాల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు. వాటన్నింటినీ లౌక్యంగా ఎదుర్కోవాలి. ఓర్పు, సహనం చాలా అవసరం. అవసరమైతే, పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన పెంచాలి. ఆరోగ్యంపైన మరింత దృష్టి పెట్టాలి. స్నేహితుల విషయంలో అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మకూడదు. కోర్టు వ్యాజ్యాలకు ఆస్కారం ఉంది. అవగాహనా లోపంతో తీసుకునే వ్యాపార నిర్ణయాలు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం లేకపోలేదు. ఈ రాశివారికి రాహుకేతువులు ఏదో ఓ రూపంలో మేలు చేస్తారు. విద్యార్థులు బలమైన ప్రయత్నంతో ఉత్తమ విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరించడానికి సరైన సమయం. నిత్యం వేంకటేశ్వర స్వామిని పూజించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3, కలిసొచ్చే వారం - మంగళవారం, రంగులు - పసుపుపచ్చ, ఎరుపు. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యస్వామి.
ఆదాయం:8; వ్యయం: 14 రాజపూజ్యం: 4; అవమానం: 5
ఆదాయం పుష్కలం. పరిపూర్ణమైన అదృష్టయోగం ఉంది. శుభకార్యాల కోసం శక్తికి మించి ఖర్చు చేస్తారు. అనవసర వ్యయాల్ని నియంత్రించడం మేలు. ముఖ్య నిర్ణయాల్లో నిపుణుల సలహా తప్పనిసరి. రాజపూజ్యం కంటే అవమానమే కాస్త ఎక్కువగా ఉంది. కాబట్టి, పరిస్థితుల్ని గమనించుకుంటూ వెళ్లాలి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పరుషమైన భాష కష్టాలను తెచ్చిపెడుతుంది. సంవత్సరం మొదట్లోనూ, చివర్లోనూ దేవగురువైన బృహస్పతి శుభ స్థానాల్లో ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలు అందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అధికార లాభం సూచితం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మే 14 నుంచి అక్టోబరు 18 వరకూ చాలా కీలకమైన సమయం. ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తథ్యం. మకరరాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తయింది. దీంతో, తృతీయ స్థానంలోని శని శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు. రాహువు సంవత్సర ప్రారంభంలో కొంత సహకరిస్తున్నా... ఉమ్మడిగా రాహుకేతువులు ఇబ్బంది కలిగిస్తారు. గురువు షష్ఠమ స్థానంలో ఉన్నప్పుడు శత్రుపీడ మనశ్శాంతిని మింగేస్తుంది. బలహీనులైన ప్రత్యర్థులకు సైతం ఎక్కడలేని బలం వస్తుంది. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు. ఆ సంక్షోభ సమయాల్లో దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. ఆత్మీయుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు. వాహన ప్రయాణంలో హద్దులు మీరిన వేగాన్ని పరిహరించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగులు పదోన్నతి సాధిస్తారు. వ్యాపారులు ఆకర్షణీయమైన లాభాలను అందుకుంటారు. కాకపోతే, సమయపాలన ముఖ్యం. ఈ ఏడాది ఓ శుభవార్త వింటారు. పూజలూ, వ్రతాల్లో పాల్గొంటారు. ప్రయాణాలను ఆస్వాదిస్తారు. బ్రహ్మచారుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. విపత్కర పరిస్థితుల్లోనూ మనోబలాన్ని కోల్పోకూడదు. ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు. కొన్ని వార్తలు కొత్త ఆలోచనలను ప్రసాదిస్తాయి. రాహుకేతు ధ్యానం, గురుజపం మంచి చేస్తాయి. లక్ష్మీనరసింహస్వామిని ఉపాసించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే వారం - శుక్రవారం, రంగులు - నీలం, తెలుపు. అదృష్ట దైవం లక్ష్మీదేవి.
ఆదాయం:8; వ్యయం: 14 రాజపూజ్యం: 7; అవమానం: 5
శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. అదృష్టయోగం 25 శాతం మాత్రమే ఉంది. అయినా, ఆత్మబలంతో పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటారు. సంపదలు వృద్ధి చెందుతాయి. సత్కార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. అదే సమయంలో క్రమానుగతమైన ధనక్షయం గోచరిస్తోంది. పొదుపు-మదుపు గురించి ఆలోచించడం తప్పనిసరి. అవమానం కంటే రాజపూజ్యం ఎక్కువగా ఉంది. దీనివల్ల, సమాజంలో కీర్తి లభిస్తుంది. మే నుంచి గురుబలం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆశించిన ఫలితాలను సాధిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసొస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ధనరాశిలో కొనసాగుతోంది. దీంతో, శని ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లకు ఆస్కారం ఉంది. రాహుకేతువులు వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఉంటాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమించాలి. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర ప్రయాణాలను పరిహరించడం ఉత్తమం. చాపకింద నీరులా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలూ జరుగుతాయి. ఆత్మీయులతో సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు ఆశాజనకం. విద్యార్థులు లక్ష్యసాధనకు మరింత కృషి చేయాలి. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఖర్చులు అధికమైనా, ఆదాయం స్థిరం. ఇలవేల్పును పూజించాలి. శని, రాహు-కేతు స్తోత్రాలు జపించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే వారం - బుధవారం, రంగులు - నీలం, ఆకుపచ్చ. అదృష్ట దైవం విష్ణుమూర్తి.
ఆదాయం: 5; వ్యయం: 5 రాజపూజ్యం: 3; అవమానం: 1
అదృష్టయోగం యాభై శాతం మేర ఉంది. గురువు అనుగ్రహం వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారు. అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ. దీనివల్ల సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. చాలా విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం తృతీయ భాగంలో... అంటే, పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు పిల్లలు అన్ని విధాలుగా రాణిస్తారు. మిత్రబలం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఏడాది ఆరంభం నుంచి... గురువు తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిపాటి అవరోధాలు ఉంటాయి. కాబట్టి, మరింత శ్రద్ధగా పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయాల్ని వాయిదా వేయవద్దు. ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం ప్రారంభమైంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. అయినా, కుంగిపోకూడదు. మానసిక ఒత్తిడిని జయించాలి. రాహు-కేతు దోషాలూ ఉన్నాయి. ఆరోగ్యంపైన రాహువు ప్రభావం ఉంటుంది. ఉత్తరార్ధంలో కేతువు విజయాన్ని ప్రసాదిస్తాడు. విద్యార్థులకు శుభ ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఆత్మబలంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక సాధనతో, నిత్య పూజలతో దైవీశక్తుల మద్దతు సంపాదించాలి. శని, రాహు గ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3, కలిసొచ్చే వారం - సోమవారం, రంగులు - పసుపుపచ్చ, తెలుపు. అదృష్ట దైవం దుర్గాదేవి.
Thanks for reading Ugadi 2025 Rasi Phalalu: Telugu New Year Horoscope Predictions For 12 Zodiac Signs
No comments:
Post a Comment