TTD: Jobs in Tirumala Tirupati Devasthanams
TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జులై 10వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు-ఖాళీలు
1. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 03
2. సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 04
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ(ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 42 ఏళ్లు.
వేతనం: నెలకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు రూ.44,570, సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు రూ.61,960.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ఆధారంగా.
ఆఫ్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 10.
చిరునామా: ది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఓసీ), సెంట్రలైజ్‌డ్ ఔట్‌సోర్సింగ్ సెల్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, కేటీ రోడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. చిరునామాకు దరఖాస్తులు పంపించాలి.
Thanks for reading TTD: Jobs in Tirumala Tirupati Devasthanams
No comments:
Post a Comment