PGCIL: పీజీసీఐఎల్‌లో 1543 ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులు
మహారత్న పీఎస్‌యూ, అతిపెద్ద ట్రాన్స్‌మిషన్ యుటిలిటీల్లో ఒకటైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన 1,543 ఫీల్డ్ ఇంజినీర్, ఫిల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు పవర్‌గ్రిడ్ కామన్ ఎఫ్‌ఈఈ రాత పరీక్ష 2025 ద్వారా ఎంపికవుతారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 17 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు- ఖాళీలు:
* ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 532
* ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్): 198
* ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్): 535
* ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్): 193
* ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 85
మొత్తం ఖాళీల సంఖ్య: 1,543
అర్హత: కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు ఫీల్డ్ ఇంజినీర్‌కు రూ.30,000 నుంచి రూ.1,20,000; ఫీల్డ్ సూపర్వైజర్‌కు రూ.23,000- రూ.1,05,000.
వయోపరిమితి: 17.09.2025 నాటికి 29 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: టెక్నికల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ టెస్ట్ 25 ప్రశ్నలు (ఇంగ్లిష్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్), ఫీల్డ్ ఇంజినీరింగ్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: దిల్లీ, భోపాల్, కోల్‌కతా, బెంగళూరు, గువాహటి, ముంబయి.
దరఖాస్తు రుసుము: ఫీల్డ్ ఇంజినీర్‌కు రూ.400. ఫీల్డ్ సూపర్వైజర్‌కు రూ.300.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.08.2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17-09-2025
PGCIL supervisors Recruitment Notification
Thanks for reading PGCIL Recruitment 2025 Notification Out for 1543 Field Supervisor and Engineer Vacancies
No comments:
Post a Comment