Jobs in Bank of Maharashtra
BANK OF MAHARASHTRA: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 మేనేజర్ ఉద్యోగాలు
పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BANK OF MAHARASHTRA) శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాలు: ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్ ఆడిట్, సీఐఎస్‌ఓ, ట్రెజరీ, ఇంటర్నేషనల్ బిజినెస్, లీగల్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ అకౌంట్స్, క్రెడిట్, సీఏ, ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ.
పోస్టు పేరు - ఖాళీలు
* డిప్యూటీ జనరల్/అసిస్టెంట్ జనరల్/ఛీఫ్/సీనియర్ మేనేజర్/మేనేజర్(స్కేల్- 2, 3, 4, 5, 6): 350
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్/బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 - 50 ఏళ్లు.
జీతం: నెలకు స్కేల్-2, 3, 4, 5, 6 పోస్టులకు రూ.64,820 - రూ.1,40,500.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 సెప్టెంబర్ 10.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 30.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 118.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.
BANK OF MAHARASHTRA Recruitment Notification
Thanks for reading Jobs in Bank of Maharashtra
No comments:
Post a Comment