Ananda vedika Monday programe date 29-07-2019.
Ananda vedika Monday programe date 29-07-2019.
ఆనందవేదికకు స్వాగతంతేదీ: 29.7.2019 4వ సోమవారం
1వ లెవెల్ -2వ లెవెల్- 3వ లెవెల్
(1 నుండి 8 తరగతులకు)
ఆనందవేదిక లో...ధ్యానప్రక్రియ కథలు కృత్యాలు భావ వ్యక్తీకరణలు మూడవ వారం పూర్తి చేసుకొని కృతకృత్యులైనాము. పాఠశాల లో...అన్ని తరగతులకు చక్కగా.. అమలు పరుస్తున్నాం అనుభవపూర్వకంగా...మనం తెలుసుకుంటున్నాం!
విద్యార్థుల ఉత్సాహాన్ని కనులారా..చూస్తున్నాం.ఇదే ఉత్సాహం తో...ఉపాధ్యాయులంతా కలిసి నడిస్తే..భావితరానికి నవ నిర్మాతలమందించే వాళ్ళమవుతాం.అందుకు కావలసిన మార్గనిర్దేశం మరింత పటిష్టంగా ఉపాధ్యాయులమంతా...కలిసి ఆనంద వేదికను ఆటలంత ఆనందంగా పాటలంత ఆహ్లాదంగా విద్యార్థులకు అందిద్దాం!
Dr.M .UMAGANDHI.(SRP)
ఇకనాల్గవ వారం ఆనంద వేదికలో..
..ప్రతీ సోమవారం 1-2-3 లెవెల్స్ (1నుండి 8 తరగతులు) కి ఏకాగ్రతగా వినడం అనే "ధ్యానప్రక్రియను " చేయించాలి.సమయం: 30 నిమిషాలు
ఉద్దేశ్యం: వినడం పట్ల ఏకాగ్రత.
శ్వాస మీద ద్యాస: 3 నిమిషాలు.
(క్రమ నియమాన్ని పాటించాలి.)
* విద్యార్థులను ప్రశాంతంగా...కళ్ళు మూసుకొని కూర్చోమనాలి..
* కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
* వాటిని కొనసాగించమనాలి.
* కొన్ని దీర్ఘమైన శ్వాసలు తీసుకోమనాలి.
* వాటిని కొనసాగించమనాలి.
* తిరిగి సాధారణమైన శ్వాసకు రమ్మనాలి.
* ఇప్పుడు నెమ్మదిగా పరిసరాలు గమనిస్తూ...కళ్ళు తెరవమానాలి.
కార్యాచరణ సోపానాలు: 25 నిమిషాలు:
* కళ్ళు మూసుకొని కొద్దిసేపు ఆయా ధ్వనులు వినమనాలి.*విన్నశబ్ధాల పై కొన్ని ప్రశ్నలు వేయాలి.
ఉదాహరణకు:
* ఎవరెవరు శబ్ధాలు విన్నారు?*ఏ ఏ శబ్ధాలు విన్నారు?
ఇంకా..ఏ ధ్వనులు వినిపించాయి? (ఇలాంటివి మరికొన్ని ప్రశ్నలువేస్తాము.)
* మరొక్కసారి కళ్ళు మూసుకోమనాలి.
*ఇప్పుడు మరికొన్ని కొత్త శబ్ధాలు కల్పించి విద్యార్ధులకు వినిపించాలి.
*మరలా వాటిపై కొన్ని ప్రశ్నలు వేయాలి.
ఉదాహరణకు:
* ఈసారి కొత్తగా ఏ ఏ ధ్వనులు వినిపించాయి?
* వారి సమాధానం లో మనకు వినబడిన ధ్వని చెప్పలేకపోతే..మీకు ఆ...ధ్వని విన్పించిందా..అని విద్యార్థులను ఉపాధ్యాయులు విన్న ధ్వనిని గురించి గుర్తు చెయ్యాలి.
*మొదటిసారికళ్ళు మూసుకున్నప్పుడు వినే శబ్ధాలకు ..
రెండవసారి కళ్ళు మూసుకున్నప్పుడు వినే శబ్ధాలకు మధ్య విద్యార్థులు వ్యత్యాసాన్ని గుర్తిస్తారు.
* ఏకాగ్రతగా..వినడం వల్ల మరింత బాగా శబ్ధాలను వినగలుగుతామని విద్యార్థులకు తెలియజేయాలి.
మౌన ప్రక్రియ: 2 నిమిషాలపాటు కళ్ళు మూసుకొని విద్యార్థులను కూర్చోమనాలి.ఇంటి దగ్గర కుటుంబసభ్యులతో స్నేహితులతో..కలిసిఈ అభ్యసన చేయమనాలి.
ధన్యవాదాలతో...
Dr. మురహరరావు.ఉమాగాంధి
(SRP)
ఆనందవేదిక
Thanks for reading Ananda vedika Monday programe date 29-07-2019.
No comments:
Post a Comment