Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 28, 2019

Orders for resolving equitable differences for all teachers


టీచర్లందరికీ సమానపని
వ్యత్యాసాలను పరిష్కరిస్తూ ఉత్తర్వులు

  బోధనా తరగతుల విషయంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల టీచర్ల మధ్య వ్యత్యాసాన్ని పరిష్కరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను డీఈవో కార్యాలయాలకి పంపింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, పరిశోధనా, శిక్షణామండలి (ఎససిఇఆర్టి) రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అన్ని పాఠశాలల్లో బోధనాతరగతులు (పిరియడ్లు) సమం గా, టీచర్లందరికీ సమానపని ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
స్కూలు పనివేళలు, మధ్యాహ్నభోజన, నెలవారీ చేపట్టాల్సిన కార్యకలాపాలు, డిజిటల్ క్లాస్ రూమ్ ల  వినియోగం, వర్చువల్ క్లాస్ రూమ్ ల వినియోగం, సహపాఠ్యాంశాల కార్యకలాపాలతోపాటు తరగతిగదిలో ఎఫెక్టివ్  గా  బోధన జరిగేలా టైంటేబుల్స్ ను రూపొందించారు. సంబంధిత టైంటేబుల్స్ అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని స్పష్టం చేశారు.

 సబ్జెక్టుల వారీగా పిరియడ్ల కేటాయింపు ఇలా..

గణితం సబ్జెక్టుకు వారానికి 30 పిరియడ్లు, కేటాయించారు. ఫిజికల్ సైన్సు 28, బయోలాజికల్ సైన్సుకు 27, సోషల్ స్టడీస్ కు 30, తెలుగుకు 30, హిందీకి 20 పిరియడ్లను కేటాయించారు.


తరగతులవారీ ఆయా సబ్జెక్టులకు పిరియడ్ల కేటాయింపు ఇలా...

6వ తరగతికి

6వ తరగతికి తెలుగు ఆరు, హిందీ నాలుగు, ఇంగ్లీషు 6, గణితం 7, జనరల్ సైన్సు 7, ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ 1, సోషల్ స్టడీస్ 6, ఫిజికల్ లిటరసీ 6, వర్క్/కంప్యూటర్/ ఒకేషనల్ ఎడ్యుకేషన్ 1, వాల్యూ ఎడ్యుకేషన్ 2, ఆర్ట్ ఎడ్యుకేషన్ 2 పిరియడ్లు చొప్పున మొత్తం 48 పీరియడ్లను కేటాయించారు. .

7వ తరగతికి

7వ తరగతికి తెలుగు 6, హిందీ 4, ఇంగ్లీషు 6, గణితం 7, జనరల్ సైన్సు 7, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ 1, సోషల్ స్టడీస్ 6, ఫిజికల్ లిటరసీ 6 వర్క్/కంప్యూటర్/ ఒకేషనల్ ఎడ్యుకేషన్ 1, వాల్యూ ఎడ్యుకేషన్ 2, ఆర్ట్ ఎడ్యుకేషన్ 2 పిరియడ్లు చొప్పున మొత్తం 48 పిరియడ్లను కేటాయించారు.

8వ తరగతికి

8వ తరగతికి తెలుగు 6, హిందీ 4, ఇంగ్లీషు 6, గణితం 7, ఫిజికల్ సైన్సు 5, బయోలాజికల్ సైన్సు 4 ఎన్విరాన్మెంటల్ ఎడ్యు కేషన్ 1, సోషల్ స్టడీస్ 6, ఫిజికల్ లిటరసి 6, వర్క్/ కంప్వూ టర్/ఒకేషనల్ ఎడ్యుకేషన్ 1 వాల్యూ ఎడ్యుకేషన్ 1 ఆర్ట్ ఎడ్యుకేషన్ 1 పిరియడ్లు చొప్పున మొత్తం 48 పిరియడ్లను కేటాయించారు.

9వ తరగతికి


9వ తరగతికి తెలుగు 6, హిందీ 4, ఇంగ్లీషు 6, గణితం 8, ఫిజికల్ సైన్సు 6, బయోలాజికల్ సైన్సు 4, ఎన్విరాన్మెంటల్ ఎడ్యు కేషన్ 1, సోషల్ స్టడీస్ 6, ఫిజికల్ లిటరసీ 5, వర్క్/ కంప్యూటర్/ఒకేషనల్ ఎడ్యుకేషన్ 1 వాల్యూ ఎడ్యుకేషన్/ఆర్ట్ ఎడ్యుకేషన్ 1 పిరియడ్లు చొప్పున మొత్తం 48 పీరియడ్లను కేటాయించారు.

10వ తరగతికి

10వ తరగతికి తెలుగు 6, హిందీ 4, ఇంగ్లీషు 6, గణితం 8, ఫిజికల్ సైన్సు 6, బయోలాజికల్ సైన్సు 4, ఎన్విరాన్మెంటల్ ఎడ్వు కేషన్ 1, సోషల్ స్టడీస్ 6, ఫిజికల్ లిటరసీ 5, వర్క్/ కంప్యూ టర్/ఒకేషనల్ ఎడ్యుకేషన్ 1, వాల్యూ ఎడ్యుకేషన్/ఆర్ట్ ఎడ్యుకేషన్ 1 పిరియడ్లు చొప్పున మొత్తం 48 పీరియడ్లను కేటాయించారు.

Thanks for reading Orders for resolving equitable differences for all teachers

No comments:

Post a Comment